ప్రస్తుతం తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల హడావిడి మొదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ ఎన్నికల పుణ్యంగా అని రాష్టంలో ఎన్ని గొడవలు జరుగుతున్నాయో ఐకే చెప్పవలిసిన అవసరం లేదు. ఇవ్వని ఇలా ఉంటే జనసేన పరిస్థితి ఇంకో రకంగా ఉంది. కనీసం స్థానిక ఎన్నికలు పూర్తియ్యేంతవరకైనా జనసేన అధిపతిగా పవన్ కల్యాణ్ పూర్తి పని చేయాల్సిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 

 

 


ప్రస్తుతం పవన్ కల్యాణ్ అలా సినిమాల్లోకి వెళ్లిపోవడం మొహానికి రంగు వేసుకోవడం, మరోవైపు స్థానికలు వచ్చేయడం ఇట్లా జరిగింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఇప్పుడు పూర్తిగా సినిమా మూడ్ లేకి వెళ్లిపోయారు. ఇప్పుడు వారందరు సినిమాకు సంబంధించి హైప్ ని పెంచే ప్రయత్నంలో ఉన్నారు జనసైనికులు. నిజానికి ఒకటే కాకుండా రెండు మూడు సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మళ్లీ రాజకీయాల వైపు టర్న్ కావడానికి చాలా తక్కువ అవకాశం ఉంది.

 

 


ఈ పరిస్థితులలో ఇప్పుడు జగన్ సర్కారును పవన్ కల్యాణ్ ఏదైనా విమర్శించినా, ఎటువంటి ఆలస్యం లేకుండా సెటైర్లు పడతాయి. సినిమాలు చేసుకునే పవన్ కల్యాణ్ వచ్చి రాజకీయం మాట్లాడుతున్నారని ఏమిటని ప్రత్యర్థులు కచ్చితంగా విమర్శలు సందిస్తారు. నిజానికి పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ చేయడంతో ఆయన పొలిటికల్ గ్రాఫ్ భారీగా పతనమయ్యింది అని చెప్పవచ్చు.

 

 

ఇవన్నీ ఇలా ఉంటే పవన్ కల్యాణ్ డైరెక్ట్ గా ప్రచారం చేసి పార్టీ కోసం పని చేసినప్పుడే ఫలితాలు ఎలా వచ్చాయో మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మాత్రం సినిమాలను చేస్తూ రాజకీయాలని పూర్తిగా వదిలేసినట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ఇలాంటి పరిస్థితి చివరికి పవన్ కళ్యాణ్ ని ఎక్కడికి తీసుకెళుతుందో....!

మరింత సమాచారం తెలుసుకోండి: