మాంసాహారం ఇష్టపడే వారు చికెన్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టంగా తింటారనే విషయం తెలిసిందే.  హోటళ్లలో, రెస్టారెంట్లలో ఎక్కువ మంది చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయడానికి ఆసక్తి చూపుతారు. సీజన్ ఏదైనా బిర్యానీ ప్రియులు మాంసాహారం అంటే పడి చస్తారు. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు నాన్ వెజ్ ప్రియుల కోసం చికెన్ బిర్యానీపై పలు ఆఫర్లను కూడా ప్రకటిస్తుంటాయి. అయితే తాజాగా ఒక హోటల్ యజమాని ఒక రూపాయికే చికెన్ బిర్యానీ అని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. 
 
రూపాయికే చికెన్ బిర్యానీ అందించటంతో ఆ హోటల్ కు పదుల సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. హోటల్ యజమాని ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడ తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూర్ జిల్లా పొన్నేరులోని ఒక హోటల్ ఈ ఆఫర్ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కోళ్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. 
 
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం వల్ల కోళ్ల విక్రయాలు, చికెన్ ధరలు పడిపోయాయి. కొన్ని ప్రాంతాలలో కిలో చికెన్ 30 రూపాయలకు విక్రయిస్తుండగా, మరికొన్ని ప్రాంతాలలో ఉచితంగా కోళ్లను పంచుతున్నారు. చికెన్, చికెన్ బిర్యానీ కొనేవారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. దీంతో హోటల్ యజమానులు వినియోగదారులను ఆకర్షించడానికి పలు ఆఫర్లను ప్రకటిస్తున్నారు. 
 
తమిళనాడులో రెండు రోజుల క్రితం ఒక కొత్త హోటల్ ప్రారంభం కాగా హోటల్ యజమాని రూపాయికే చికెన్ బిర్యానీ అంటూ బోర్డు పెట్టడంతో భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. కేవలం 2 గంటల్లో యజమాని 120 కిలోల చికెన్ బిర్యానీని విక్రయించాడు. హోటల్ యజమాని మాట్లాడుతూ కరోనా భయంతో చికెన్ బిర్యానీ సేల్ అవుతుందా అని మొదట అనుమానాలు కలిగాయని... చికెన్ తినడంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: