ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి నడుస్తోంది. అయితే.. ఇప్పటివరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలకు నామినేషన్లు ముగియటంతో అందరు నాయకులు, కార్యకర్తలు ప్రచారాలు చేయటంలో పడ్డారు. ఈ రోజు చివరి రోజు నామినేషన్ల సందర్భంగా అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా..  స్థానిక ఎన్నికల్లో రోజు రోజుకి ఆసక్తి కరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

 

అది ఏమిటంటే.. తెలుగు ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ హీరోగా కొనసాగుతున్నాయి. అయితే ఆయన సోదరి స్థానిక ఎన్నికల బరిలోకి దిగారట. ఏపీలో ప్రస్తుతం అధికారం చెలాయిస్తున్న వైసీపీ పార్టీ తరఫున ఆమె జడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే.. టీడీపీ పార్టీ నుంచి ఒకరి తరువాత ఒకరు సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా వలస పట్టి అధికార పార్టీలోకి వలస పోతున్నారు. కాగా., ఇదిలాఉండగా ఓ స్టార్ హీరో సోదరి కూడా అధికార పార్టీ తరపున ఎన్నికలలోకి దిగారు.

 

అయితే.. ఆ స్టార్ హీరో మరెవరో కాదండోయ్.. రామానాయుడు రెండవ కుమారుడు విక్టరీ వెంకటేశ్. ఈయన సోదరి స్వరూపరాణి. ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో కుటుంబంతో నివాసం ఉంటుంది. స్వరూపిణి భర్త తరపు వారు కాస్త రాజకీయాలకు దగ్గరగా ఉండటంతో.. దీంతో రాజకీయాలంటే ఆసక్తి కనబర్చిన స్వరూపిణి స్థానికంగా జడ్పీటీసీగా పోటీ చేశారు.

 

అయితే.. ఈమె వెంకటేశ్ తోడ పుట్టిన సోదరి కాదు. రామానాయుడు సోదరుడి కుమార్తె ఈ స్వరూపరాణి.. అలా వెంకటేష్ కు సోదరి అన్నమాట. స్వరూపిణి మెట్టినిల్లు దగదర్తి మండలం కావడంతో ఆమె కుటుంబంతో సహా అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఎన్నడూ రాజకీయాల్లో కనిపించలేదు ఈ కుటుంబం. కానీ ఇప్పుడు స్వరూపరాణి ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: