జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు ఒక్కడే పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సరే చంద్రబాబు అంటేనే అబద్ధాలకు, అభూత కల్పనలకు మారుపేరన్న విషయం అందరికీ తెలిసిందే. ఏమీ జరగకపోయినా, జరిగిన ఘటన చాలా చిన్నదే అయినా సరే అక్కడేదో జరిగిపోయిందంటూ చంద్రబాబు ప్రత్యర్ధులపై మ్యాగ్జిమమ్ బురద చల్లేస్తుంటాడు. ఎలాగూ మద్దతిచ్చే పచ్చమీడియా ఉంది కాబట్టి ప్రత్యర్ధులను గబ్బు పట్టించే కార్యక్రమం నిరాఘాటంగా సాగిపోతుంటుంది.

 

సరే చంద్రబాబు ఆరోపణలు, విమర్శలతో పాటు పచ్చమీడియా రాతలను జనాలు ఎంత వరకూ పట్టించుకుంటారు ? అన్నది వేరే విషయం.  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పార్టీ మొత్తం మీద చంద్రబాబు ఒక్కడే ప్రతిరోజు కనిపిస్తున్నాడు. మరి అధికారాన్ని అనుభవించిన నేతల్లో చాలామంది ఎందుకు పోరాటంలో కనబడటం లేదు ? ప్రజా చైతన్య యాత్ర అన్నా, పాదయాత్ర అన్నా, చివరకు ధర్నాలు, ఆందోళనలు జరపాలన్నా కూడా చంద్రబాబు మాత్రమే కనబడుతున్నాడు.

 

ఇందుకు కారణం ఏమిటంటే జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు, పచ్చమీడియా చెబుతున్నంతగా జనాల్లో వ్యతిరేకత లేదన్నది వాస్తవం. ఇదే విషయాన్ని పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు చంద్రబాబుకు స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వంపై  జనాల్లో లేని వ్యతిరేకను సృష్టించాలంటే సాధ్యం కాదని కాబట్టి కొంత కాలం గడువు ఇచ్చిన తర్వాత అప్పుడు పరిస్ధితిని బట్టి నిర్ణయం తీసుకుందామని పార్టీ వేదికలపైనే నేతలు చెప్పారు. అయితే చంద్రబాబు వాళ్ళ సూచనలను పట్టించుకోలోదు.

 

జగన్ ప్రభుత్వంపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందంటూ చంద్రబాబు, చినబాబు, పచ్చమీడియా ఒకటే ఊదరగొడుతున్నారు. జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది కాబట్టి మనం దాన్ని క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు నేతలకు పదే పదే ఒత్తిడి పెడుతున్నాడు. దాంతో చాలామంది చంద్రబాబు వైఖరిపై మండిపోతున్నారు. అయితే ఏమీ చేయలేక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోతున్నారు. మరికొందరు నేతలు ఏకంగా పార్టీకి రాజీనామాలే చేసేస్తున్నారు. ఇందుకనే చంద్రబాబు ఒక్కడే ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి జనాలంతా జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని చెప్పుకుంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: