కరోనా  వైరస్ ప్రస్తుతం ఎంతోమందిని ప్రాణభయంతో వణికిస్తోంది. ఎక్కడ కరోనా తమ వద్దకు వచ్చి ప్రాణాలను హరించుకుపోతుందో  అని ఎంతో బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు. ఎన్నో  ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వరకు కరుణ వైరస్  అందరికీ ప్రాణ భయం కలిగించింది... ఇతనికి మాత్రం ఎంతో ఆనందాన్ని కలిగించింది కరోనా వైరస్. కరోనా  వైరస్ ఆనందం కలిగించడం  ఏమిటి అంటారా... అవును నేను చెప్పేది నిజమే... ఇంతకీ కరోనా  వైరస్ ఎలా ఆనందాన్ని కలిగించింది అంటే... కరోనా  వైరస్ సోకింది అని అబద్ధాలు చెప్పి ఏకంగా ఆఫీసుకు సెలవు పెట్టేసాడు ఇక్కడ ఒక ఉద్యోగి. 

 

 

 కానీ చివరికి దొరికిపోయి  ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. చైనా దేశంలో కరోనా  ఎఫెక్ట్ మిగతా దేశాల కంటే ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ  ఉద్యోగి ఆఫీస్ కు ఫోన్ చేసి తనకు కరోనా  వైరస్ వచ్చింది అంటూ అబద్ధాలు చెప్పాడు. కరోనా  ఉందని చెప్పడంతో ఆఫీస్ అధికారులు ఆఫీస్ కు  రావద్దని పూర్తిగా తగ్గిన తర్వాత  ఆఫీస్ కి రావాలి అంటూ చెప్పారు. ఇక ఆ ఉద్యోగి ద్వారా ఇతర ఉద్యోగులకు కూడా కరోనా  వైరస్ సోకి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసి మిగతా ఉద్యోగులకు కూడా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సదరు కార్యాలయాన్ని పూర్తిగా శుభ్రం చేయించారు కూడా . 

 

 

 అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా... ఆ ఉద్యోగి వేసిన ప్లాన్ కాస్త బెడిసి కొట్టింది. సదరు ఉద్యోగికి కరోనా  వైరస్ సోకింది అని  ఆఫీస్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఉద్యోగికి కరోనా వైరస్ ఎలా సోకింది ..  వైరస్ సోకిన తర్వాత ఎక్కడ ఎక్కడ ఎవరిని కలిశారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటూ  పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే తాను షాపింగ్ మాల్లో  కొంతమందిని కలిశాను అంటూ ఆ ఉద్యోగి చెప్పుకొచ్చాడు. ఇదిగో ఇందుకు సంబంధించిన ఆధారాలు అంటూ పలు పత్రాలను కూడా ఎంతో ధైర్యంగా చూపించాడు . కానీ అవన్నీ తప్పుడు పత్రాలని ... తేల్చిన పోలీసులు అతడికి కరోనా  నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఇక కరోనా  వేరే వ్యక్తికి  సోకలేదు అని తేలడంతో తప్పుడు సమాచారం వ్యాప్తి  చేసినందుకు అతనికి మూడు నెలల జైలు శిక్ష విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: