2014 మార్చ్ 14వ తేదీన జనసేన పార్టీ స్థాపించబడిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఎన్నో పరాభవాలను ఎదుర్కొంటూ ముందుకు నడుస్తుంది జనసేన పార్టీ. ఇక ఈ రోజుకి జనసేన పార్టీ ఏడో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నది. అయితే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో జనసేన పార్టీ ముఖ్య నేతలు అందరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ముఖ్య నేతలందరూ ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... గత ఎన్నికల్లో పవన్ ఒంటరిగా పోటీ చేయడానికి గల కారణాలు తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో ఎన్నో పార్టీలు తమతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేశాయి అంటూ  నాదెండ్ల మనోహర్ తెలిపారు. 

 

 

 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమతో పొత్తు కోసం ప్రయత్నాలు జరిపినట్లు తెలిపారు. ఆ రోజే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని... యువత కోసం ఒక తరానికి ఉపయోగపడేలా రాజకీయాలు చేయాలి తప్ప... ఎన్నికల కోసం పదవుల కోసం రాజకీయాలు చేయకూడదు అంటూ  తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు నాదెండ్ల మనోహర్. జనసేన ఎన్నికల్లో ప్రత్యేకంగా కొంతమంది యువకులను ఎంపిక చేసి మరీ పోటీ చేయించాయమని... కానీ ఇతర పార్టీల్లో  ఇలాంటి పరిస్థితులు లేవు అంటూ వ్యాఖ్యానించారు.

 

 

 ఇతర పార్టీల్లో 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమని అభ్యర్థులకు చెబుతారు... ఇలాంటి వారు సమాజానికి ఏమైనా ఉపయోగపడతారా  అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతం విడిపోయి నవ్యాంధ్రప్రదేశ్ గా  ఏర్పడిన తర్వాత... జరుగుతున్న అన్యాయాలపై పోరాడేవారు అసలు నేటి రాజకీయాల్లో ఎక్కడున్నారు అంటూ ప్రశ్నించారు. జనసేన ఎప్పుడు స్వార్థ రాజకీయాలు చేయవద్దని ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నదని... తమ  పార్టీ ఎప్పుడూ యువతకే పెద్దపీట వేస్తోంది అంటూ నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: