కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ వణికించేస్తోంది. వరదలకు.. సునామీలకు కూడా ఇంత భయపడి ఉండరు కానీ ఈ వైరస్ కు మాత్రం ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడవణికిస్తుంది. అలాంటి ఈ కరోనా వైరస్ మన భారత్ లోకి వ్యాపించిన సంగతి తెలిసిందే. 

 

అయితే ఈ వైరస్ దృష్ట్యా అన్ని రకాలుగా కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే జైళ్లలో ఉండే ఖైదీల విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. చెప్పాలంటే.. కరడుగట్టిన ఖైదీలు ఉండే తీహార్‌ జైల్లో ఏకంగా ఓ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. 

 

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ఖైదీలు అందరికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పటి వరుకు ఏ ఖైదీకి కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదు.. అంతేకాదు.. కొత్తగా తీహార్ జైల్లోకి వచ్చే ఖైదీలకు స్క్రీనింగ్ చేసి ప్రత్యేక వార్డుల్లో 3 రోజులు పాటు ఉంచి కరోనా వైరస్ లక్షణాలు కనిపించకపోతే వారిని మిగితా అందరి ఖైదీలు తిరిగి స్థలంలోకి వదులుతున్నారు. 

 

కాగా ఈ తీహార్ జైల్లో వంద కాదు రెండు వందలు కాదు.. ఏకంగా 17,500 ఖైదీలు ఉన్నారు. షాక్ అయ్యారు కదా! నిజంగానే అంతమంది నీచులు.. కరుడుగట్టిన ఖైదీలు ఆ తీహార్ జైల్లో ఉన్నారు.. అందుకే ఆ నీచులకు ఎవరికి కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇరాన్ లో కూడా ఇలా ఎక్కువమంది ఉన్న జైల్లో కరోనా వైరస్ వ్యాపించడం వల్ల ఎంతోమంది ఖైదీలను వదిలేశారు. అయితే 5 ఏళ్లకు మించి ఆ జైల్లో ఉన్నవారిని మాత్రం ఇరాన్ ప్రభుత్వ అధికారులు కూడా వదలలేదు. 

 

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే?  ఇరాన్ లో జైల్లో ఖైదీలకు ఎలా అయితే కరోనా వైరస్ సోకిందో అలానే ఇక్కడ నిర్భయ నిందితులకు కూడా కరోనా వైరస్ సోకి చావాలి అని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఉరి శిక్ష నుండి తప్పించుకున్నందుకు ఈ నెల 20వ తేదీన తెల్లవారు జాము 5.30కి ఉరిశిక్ష అమలు చెయ్యాల్సి ఉండగా ఈసారి తప్పించుకోకుండా చావాలి అంటే వారికీ కరోనా రావాలి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: