ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు బిక్కుబిక్కుమంటూ భయాందోళనలతో బతుకుతున్నాయి కరోనా వైరస్ గురించి. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ఇటలీ దేశంలో తాసు పాము పడగ విప్పి నట్టు చాలా మందిని బలితీసుకుంది. ఇటలీ దేశంలో ప్రజలు ఇప్పుడు ఎవరూ కూడా ఇంటి నుండి బయటకు రాకూడదు అని అక్కడ ఉన్న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదే తరుణంలో ప్రపంచంలో అన్ని ఖండాలలో మరియు అదే విధంగా దాదాపు 140 కి పైగా దేశాలలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు అంతర్జాతీయ స్థాయిలో లెక్కలు చెబుతున్నాయి. భారతదేశంలో కూడా ఇటీవల ఈ వైరస్ బయటపడటంతో కేంద్ర వైద్య బృందం అలర్ట్ అయింది. కేరళ మరియు హైదరాబాద్ ఇంకా కొన్ని రాష్ట్రాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

 

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో ఇటలీ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ ఉన్నట్లు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సినిమా హాలు మరియు అదే విధంగా షాపింగ్ మాల్స్ ప్రభుత్వ ఆదేశాలు మేరకు క్లోజ్ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో కరోనా యొక్క ప్రభావం ఆహారపు అలవాట్లు కూడా బాగా రిఫ్లెక్ట్ చూపుతోంది. చాలా మంది ప్రజలు మాంసాహారాన్ని తగ్గించేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కరుణ వైరస్ రావటంతో ఎక్కువగా పనస పండు ఫ్రూట్ కి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే బిర్యానీని తినడం ఆపలేకపోతున్న కొందరు అందులో మాంసానికి బదులుగా ప్రత్యామ్నాయంగా పనసను ఎంచుకుంటున్నారు ప్రజలు.

 

దీంతో పనసకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో పనస రేట్లకు కూడా రెక్కలొచ్చాయి. మొన్నటివరకు కిలో పనస రూ.50 ఉండగా.. అది కాస్త ప్రస్తుతం రూ.120కు ఎగబాగింది. దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి వేగవంతం అవుతోన్న నేపథ్యంలో.. చికెన్, మటన్‌ల బదులు జాక్ ఫ్రూట్(పనస) తినడం మంచిదని కొందరు వైద్యులు సూచించడంతో పనస పండు కి మార్కెట్ లో మంచి డిమాండ్ పెరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: