జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీతో దోస్తీ కట్టడంతో ఏపీలో సరికొత్త రాజకీయం ఏర్పడింది. దీంతో చాలా వరకు వీళ్ళిద్దరి కాంబినేషన్ చూసి ఇంకేంటి సూపర్ వైసీపీకి ఇదే సరైన ప్రత్యామ్నాయం అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకునే సమయంలో కామెంట్ చేయటం జరిగింది. అటువంటిది ఇద్దరి కాంబినేషన్ లో వేసిన మొట్టమొదటి అడుగే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే విశాఖపట్టణం జిల్లాలో జెడ్పిటిసి మరియు ఎంపీటీసీ నామినేషన్ ఘట్టం ముగిసే సమయానికి సగానికిపైగా స్థానాల్లో ఈ రెండు పార్టీలకు అసలు ఎంట్రీ లేదట. అంటే నామినేషన్లే వేయలేదు.

 

మరోవైపు చూసుకుంటే విశాఖ నగర శివార్లు అయిన భీమిలీ, సబ్బవరం, పెందుర్తి వంటి చోట్ల బోణీ కొట్టలేదు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఈ రెండు పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయి. ఇదే సమయంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు కూడా అటువైపు దృష్టి పెట్టలేదు. విశాఖపట్టణం జిల్లాలో 651 ఎంపీటీసీ స్థానాలు ఉంటే రెండు పార్టీలు కలిసి 300కు పైగా మాత్రమే నామినేషన్లు వేశారు అట. అంతే కాకుండా ఇందులో కూడా ఉపసంహరణ అభ్యర్థులు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

 

ఇదే టైం లో ఉత్తరాంధ్ర జిల్లాలు చూసుకుంటే విశాఖ నగరం మరియు శ్రీకాకుళం జిల్లాలో ఈ కూటమి స్టార్టింగ్ లోనే బోల్తా పడినట్లయింది. దాదాపు ఇక్కడ చాలా వరకు నామినేషన్లు తక్కువ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో బలమైన క్యాడర్ మరియు పార్టీలుగా ముందుకు వస్తామని పెద్ద పెద్ద డైలాగులు వేసిన ఇరు పార్టీలకు చెందిన నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో కుదేలు అవ్వటం చూస్తే...ఇది మరొక అట్టర్ ఫ్లాప్ కాంభినేషన్ అనే టాక్ ప్రస్తుతం ఏపీలో వినబడుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: