ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కలవరపరుస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలోని జంతు మాంసం మార్కెట్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అక్కడి నుండి అతి వేగంగా ప్రపంచంలోని మిగతా దేశాలన్నింటికీ విస్తరించిన మహమ్మారి ఇప్పటికే కొన్ని వేల మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇప్పటికే దాని బాధితుల సంఖ్య లక్ష దాటగా చాలా దేశాల్లోని నగరాల్లో హై అలెర్ట్ ప్రకటించారు.

 

అయితే చైనాలోని మొదటి కరోనా కేసు గురించి మొదట బయటకు రాగానే అక్కడి అధికారులకు మహిళ ఫోన్ చేశారు ఆమె పేరు షి జంగ్లీ. గత 16 ఏళ్లుగా గబ్బిలాల పైన మరియు వాటిలో నివాసం ఉండే వింత వైరస్ పైన పరిశోధన చేస్తున్న ఈమె గబ్బిలాలు సంచరించే గుహల్లో రోజుల తరబడి గడిపి నమూనాలను సేకరించి అందులోని డీఎన్ఎ లను కూడా పరిశీలించేది. మొట్టమొదటి కరోనా కేసు బయటికి రాగానే ఆమె దానికి కారణం గబ్బిలాలే అని చెప్పి 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ కు మూలం వైరస్ అని కూడా చాలా ఖచ్చితమైన నమ్మకంతో చెప్పింది.

 

అయితే అప్పటికన్నా కరోనా వైరస్ చాలా బలంగా మారిందని.. దీని ప్రభావం ఇప్పుడు ఎక్కువగా ఉంటుందని వెంటనే వైద్యులు గుర్తించారు. మొదటి బాధితుడి రక్తపు నమూనాలను పరిశీలించిన షీ జంగ్లీ ఇది గబ్బిలాల నుంచి వచ్చినట్లు గుర్తించింది. గబ్బిలాల నుండి జంతువులకు కూడా వైరస్ సోకే అవకాశం ఉన్నందున వెంటనే మాంస విక్రయాన్ని నిలిపివేయాలని.... అలా చేయకపోతే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె అధికారులకు వివరించింది. ఆమె మాట విని చైనా అధికారులు వెంటనే అక్కడా మాంస విక్రయాలపై నిషేధం విధించారు. ఆమె నిజంగా అలా చేయకుండా ఉండుంటే ఈపాటికి చైనాతో పాటు మిగతా దేశాలన్నీ కూడా అల్లాడిపోయేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: