తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కానీ ఒక టైంలో అదిరిపోయే రాజకీయాలు చేసే తల పండిపోయిన నేతలు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పార్టీలో అటువంటి నేతలు చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేని సిచువేషన్ వచ్చింది. దీనంతటికీ కారణం చంద్రబాబు స్వయంకృతాపరాధమే అని చాలామంది అంటున్నారు. తెలంగాణలో అయితే ఇప్పటికే పార్టీ గల్లంతయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ కనిపించడం లేదు. పార్టీలో ఉన్న నాయకుడు ఒకరు పార్టీని వీడుతున్నారు. అలా పార్టీని వీడుతున్న వారంతా గతంలో చంద్రబాబు కారణంగా కష్టాలు ఎదుర్కొన్న వారే. కరణం బలరాం చీరాల నియోజకవర్గం చెందిన నాయకుడు ఎప్పటినుండో తెలుగుదేశం పార్టీకి విధేయతతో పనిచేస్తూ రాణించారు. అటువంటి సీనియర్ నాయకుని ఆయన చంద్రబాబు గత ఐదేళ్లలో అత్యంత దారుణంగా అవమానించారు.

 

వైసీపీ పార్టీ నుండి వచ్చిన నేతలకు అధిక ప్రాధాన్యతనిచ్చి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని చంద్రబాబు కూరలో కరివేపాకు లాగా పక్కన పెట్టేశారు. ఇటువంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీని ముంచేస్తున్నాయి. కరణం బలరాం మరియు రామసుబ్బారెడ్డి అదేవిధంగా లైన్ లో ఉన్న సతీష్ రెడ్డి పార్టీ మారడానికి కారణంచంద్రబాబు నాయుడు అనే టాక్ బలంగా ప్రస్తుతం ఏపీ లో వినపడుతోంది.

 

ఇటువంటి నేపథ్యంలో జంపింగ్ జపాంగ్ లపై తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించిన సమయంలో పార్టీలో ఎప్పటి నుండో విధేయత గా పనిచేసిన కొంతమంది నాయకులు...ఈ విషయం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు పై సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. " ఆపండి మీ సోది " బాబు గతంలో అవమానించడం తో టైం చూసుకుని జంపు అయ్యారు అంటూ సొంత క్యాడర్ చంద్రబాబుపై తిరగబడి నట్లు ఏపీ మీడియా వర్గాల్లో వార్తలు వినబడుతున్నాయి. అంతేకాకుండా చంద్రబాబు వయసు కూడా మీద పడటంతో చాలామంది అభద్రతాభావంతో తెలుగుదేశం పార్టీ నుండి భవిష్యత్తు కాపాడుకోవడానికి వెళ్లి పోతున్నట్లు కూడా టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: