బైరెడ్డి మాటని నెగ్గించుకున్నారు. నందికొట్కూరులో రాజీ ఫార్ములా....బైరెడ్డి సిద్దార్ధ రెడ్డికి ఎమ్మెల్యే  ఆర్ధర్ కి  మధ్య  మాట మాట బాగా పెరిగింది. చివరకి అది పెద్ద ఫైట్ గా మారిపోయింది. తనకి గౌరవం ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే విమర్శలు కురిపించాడు. ఎన్నికలకి ముందు వర్గం ఉంటుందా వచ్చిన వారికి అని బైరెడ్డి కూడా గట్టిగానే చెప్పి రివర్స్ కౌంటర్ ఇచ్చాడు చాలా తీవ్రంగా. మరి ఇంకేం అవుతుంది ఇద్దరికీ మధ్య కయ్యం గట్టిగానే అయ్యింది.

 

స్థానిక సంస్థల ఎన్నికలతో నందికొట్కూరులో ఆధిపత్యం తీవ్రంగా మారింది. రాజీ కుదర్చడానికి జిల్లా మంత్రి కుమార్ యాదవ్ బరిలోకి దిగారు. ఇరువురి మధ్య సర్దు చెప్పి రాజీ కుదిర్చారు. నందికొట్కూరు జడ్పిటీసి,ఎంటీపీసీ స్థానానికి సంబంధించి ఎమ్మెల్యే ఇలా చెప్పాడు. తన వర్గం అభ్యర్థులకు మూడు మండలాల్లో బీ ఫారాలు కావాలంటూ మొదట తీవ్ర ప్రయత్నం చేసాడు.

 

పెద్దలు రెండింటితో సరిపెట్టుకోవడమే మంచిది అని వెల్లడించారు. అంతే కాకుండా సిద్ధార్ధ రెడ్డి కూడా రెండే ఇస్తాం మూడు ఇచ్చేది లేదంటూ చెప్పాడు. కేవలం పాములపాడు మరియు జుపాడుబంగ్లా మాత్రమే ఇవ్వడానికి సరే అన్నారు. మొదట్లో ఆర్ధర్ ఒప్పుకోలేదు. కానీ చివరకి సరిపెట్టుకోక తప్పలేదు. 

 

మాజీ ఎమ్మెల్యే ఐజయ్య వైసీపీ వైపు ఉండడంతో వెనక్కి తగ్గాడు ఎమ్మెల్యే ఆర్ధర్. ముందు ధర్నా చెయ్యాలని అలోచించి ఫాలో అవుదామనుకుంటే దారిలో ఐజయ్య అడుగు పిడుగులా మారిపోయింది. దీనితో వెనుకడుగు వెయ్యక తప్పలేదు. దీనితో ధర్నాని విరమించుకోక తప్పలేదు.

 

నందికొట్కూరులో మొత్తం 29  వార్డుల్లో కేవలం ఆరు మాత్రమే ఎమ్మెల్యేలకు ఇస్తారని సిద్ధార్ధ రెడ్డి వర్గం చెప్పిందట. అయితే ఇక్కడ 15 సీట్లు కావాలని ఎమ్మెల్యే అడిగేసరికి మళ్ళీ మొదటికి వచ్చింది. పంచాయతీ కూడా ఆరు సీట్లతో తేలిపోయే అవకాశం ఉంది అని స్పష్టం అయిపోయింది. ఇంకేం ఉంది సిద్ధార్ధ పంతం నెగ్గింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: