ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌పై సైతం తీవ్రంగా చూపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు క‌రోనా ప్ర‌భావం పెళ్లిళ్ల‌పై సైతం తీవ్రంగా ప‌డింది. క‌రోనా భారీ నుంచి త‌మ‌ను తాము కాపాడు కునేందుకు ప్ర‌తి ఒక్క‌రు శుభ కార్యాలు కూడా వాయిదా వేస్తున్నారు. సాధ్యమైనంత వరకు రద్దీగా ఉండే కార్యక్రమాలను వాయిదా లేదా తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి చేసింది. ఇక హైద‌రాబాద్‌తో పాటు ప‌క్క‌నే ఉన్న బెంగ‌ళూరు, ముంబై, నాగ‌పూర్ లాంటి ఐటీ న‌గ‌రాల్లోనూ ఈ వైర‌స్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంద‌డంతో చాలా మంది క‌ష్టంగా పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకుంటున్నారు.

 

క‌రోనా కోర‌లు చాస్తుండ‌డంతో పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టుకున్న పలు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. వాస్త‌వానికి గ‌త యేడాది పెళ్లిళ్ల ముహూర్తాలు త‌క్కువుగా ఉన్నాయి. దీంతో చాలా మంది ఈ యేడాది ముందుగానే ముహూర్తాలు పెట్టుకున్నారు. రెండు, మూడు నెల‌ల ముందే ఫంక్ష‌న్ హాల్స్‌, కేట‌రింగ్ అన్ని బుక్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు సడెన్‌గా క‌రోనా వ‌ల్ల పెళ్లిళ్లు ర‌ద్ద‌వ్వ‌డంతో అటు క‌ళ్యాణ మండ‌పాల వ్యాపారులు, ఫంక్ష‌న్ హాట్ డెక‌రేష‌న్ చేసే వాళ్ల నుంచి అంద‌రి బిజినెస్‌లు డ‌ల్ అయ్యాయి. ఇక యేడాది కాలంగా పెళ్లి ముహూర్తాలు లేక ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతోన్న వారు ప‌డుతోన్న వారిని ఇప్పుడు క‌రోనా పెద్ద దెబ్బ కొట్టింది.

 

ఇక స‌మ్మ‌ర్‌లో మంచి ముహూర్తాలు చూసుకుని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన దంప‌తులు.. వారి కుటుంబాల బాధ‌లు వ‌ర్ణ‌నాతీతంగా ఉన్నాయి. ఇప్పుడు మంచి ముహూర్తాలు వెళ్లిపోతే మ‌ళ్లీ శ్రావ‌ణ మాసం వ‌చ్చే వ‌ర‌కు ఉండాలి. దీంతో క‌రోనా దెబ్బ‌తో వాళ్ల బాధ‌లు మామూలుగా లేవు. ఇక దేశంలో ఇప్పటికే 85 కేసులు నమోదు అవ్వగా.. వైరస్‌ సోకి ఇద్దరు మృతి చెందారు. చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న ప్రమాదకర వైరస్‌ అక్కడ కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ ఆసియా వెలుపల గల దేశాలపై మరణమృదంగం మోగిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: