అందర్నీ బాధిస్తోంది కరోనా వైరస్. ఎక్కడో ఉన్న చైనా నుండి ఇటు భారతదేశం వచ్చి ప్రజల్ని బాధిస్తోంది. దీనితో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఎలర్ట్ అయ్యాయి. కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి  అనేక  విధాలుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విద్యాసంస్థలు, కాలేజీలు, పాఠశాలలు, సినిమా హాళ్ళు వంటి ప్రదేశాలని మూసివేయాలని నిర్ణయించుకున్నారు.

 

జనసమర్ధంగా లేకుండా చూడాలని ఆంక్షలు విధిస్తున్నాయి. చైనాలో మరణాలు ఆగడం లేదు. అలానే యూరప్ లో కూడా మృతుల  సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 5423 మంది కరోనా వైరస్ వల్ల మృతి చెందారు. ఢిల్లీలో  కూడా ఒక  వృద్ధురాలు కరోనా తో మృతి చెందింది. ఎంతో ప్రమాదం అని ఎన్నో నిర్ణయాలు తీసుకుంటోంది ప్రభుత్వం.

 

 

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మర్చి 31 వరకు కూడా పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాల్స్ మూసి వెయ్యాలని నిర్ణయం తీసుకుంది. దీనితో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఎలర్ట్ అయ్యాయి. తాజాగా జగిత్యాలలో ఒక యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్టు తెలిసింది. అయితే వైద్యులు పరీక్షించి కరోనా లక్షణాలు ఉన్నట్లు చెప్పారు. ఆ యువకుడు ఇటీవలే దుబాయ్ నుండి వచ్చాడట. అయితే కరోనా లక్షణాలని గుర్తించడంతో హైదరాబాద్  గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 

 

జగిత్యాల మండలం గోపాలరావు పేటకు చెందిన 23 ఏళ్ళ యువకుడు ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళాడు. అయితే తిరిగి వచ్చాక జలుబు , దగ్గు వంటి లక్షణాలు ఉండడంతో ఆసుపత్రికి వెళ్ళాడు. దానితో వైద్యులు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని గుర్తించారు.ఎంతో ప్రమాదం అని ఎన్నో నిర్ణయాలు తీసుకుంటోంది ప్రభుత్వం. సిరిసిల్ల , జగిత్యాల జిల్లాల కి ఈ మధ్య కొన్ని వందల   మంది దుబాయ్  నుండి రావడంతో  కాస్త  భయంగా ఉంది  స్థితి . 

మరింత సమాచారం తెలుసుకోండి: