స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ... అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ వస్తాయనే సంగతి తెలిసిందే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకుంటుంది. అయితే 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీకి అనుకూల వాతావరణం ఉండటంతో, అప్పుడు జరిగిన స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కాయి. చాలాచోట్ల ఆ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది కూడా. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

 

ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి...ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫుల్ అడ్వాంటేజ్ ఉంది. దాదాపు 70 శాతంపైగా గెలుచుకునే అవకాశముంది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో క్లీన్‌స్వీప్ చేసే ఛాన్స్ ఉంది. అయితే అలా వైసీపీ క్లీన్‌స్వీప్ నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లా అవనిగడ్డ  నియోజకవర్గం కూడా ఉండొచ్చని తెలుస్తోంది.

 

2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో ఉన్న 6 జెడ్‌పి‌టి‌సి స్థానాలని టీడీపీనే గెలిచేసుకుంది. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో మొత్తం జడ్పీటిసీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఈ సారి పరిస్థితి వైసీపీకు అనుకూలంగా ఉంది. అక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు 6 జెడ్‌పి‌టి‌సి స్థానాలని గెలవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఎప్పటి నుంచో టీడీపీకి అండగా ఉంటున్న ద్వితీయ శ్రేణి నేతలని వైసీపీలోకి తీసుకుంటున్నారు.

 

టీడీపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న కోడూరు మాజీ జడ్పీటిసీ సభ్యుడు బండె శ్రీనావాసరావు వైసీపీలోకి వచ్చారు. ఇక మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు మోకా బుచ్చిబాబు వైసీపీలోకి చేరి జడ్పీటిసీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అలాగే నియోజకవర్గాన్నే ప్రభావితం చేసే నాగాయలంక మండలంలో వర్గ విభేదాల తారస్థాయికి చేరుకోవడంతో, జెడ్‌పి‌టి‌సి స్థానంలో వైసీపీ గెలిచే అవకాశముంది. అలాగే మిగిలిన స్థానాల్లో కూడా టీడీపీ నేతలని పార్టీలో చేర్చుకుంటూ ముందుకెళుతున్న సింహాద్రి... వైసీపీ జెండా ఎగరవేయాలని కష్టపడుతున్నారు. మొత్తానికైతే అవనిగడ్డలో ఆరు జెడ్‌పి‌టి‌సిలు వైసీపీ ఖాతాలోనే పడేలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: