విశాఖ మేయర్ పీఠాన్ని కొట్టాలని వైసీపీ ఉవ్విళ్ళూరుతోంది. దానితో పాటు మరో కోరిక కూడా ఉంది. విశాఖ ఇప్పటిదాకా వైసీపీకి చిక్కలేదు. 2014 నుంచి విశాఖ జనం వైసీపీని దూరం పెడుతున్నారు. అదే విధంగా జగన్ వేవ్ బలంగా వీచిన 2019 ఎన్నికల్లో కూడా విశాఖలో మొత్తం సీట్లు టీడీపీ గెలుచుకుంది.  దాంతో విశాఖ ప్రజల అభిమానాన్ని ఇప్పటికైనా పూర్తిగా  పొందాలన్నది వైసీపీ బలమైన ఆకాంక్ష.

 


ఇవన్నీ పక్కన పెడితే వైసీపీకి విశాఖ మేయర్ కచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. వైసీపీ సర్కార్ విశాఖను రాజధానిగా ప్రకటించారు. విశాఖలో ఎవరూ రాజధాని కోరుకోలేదని చంద్రబాబు గట్టిగా చెబుతూ వచ్చారు. బాబుని విశాఖ రాకుండా వైసీపీ విమానాశ్రయంలో అడ్డుకుంది. ఇలా విశాఖ మేయర్ గిరీ అన్నది వైసీపీని ఇపుడు ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది.

 

ఆ క్రమంలో జీవీ ఎంసీ ఎన్నికలను ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. కానీ చూసుకుంటే వైసీపీ అభ్యర్ధుల జాబితా చూశాక మాత్రం ఆ పార్టీ గెలుపు అవకాశాలు ఒక్కసారి తగ్గిపోయాయని సొంత పార్టీ నేతలే అంటున్నారు. నిజానికి ఎన్నికలు ప్రకటించిన తరువాత వైసీపీకి సిటీలో మంచి ఊపు వచ్చింది. కచ్చితంగా ఆ పార్టీ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు మాత్రం సీన్ రివర్స్ అయింది.

 

ఎక్కడికక్కడ వైసీపీ ఇంచార్జిలు సీట్లు అమ్ముకున్నారని పార్టీలో పెద్ద రచ్చ జరుగుతోంది. కార్యకర్తలు ఇంచార్జిల ఇళ్ళ‌ వద్దకు వెళ్ళి ఆందోళన చేస్తున్నారు. అదే సమయంలో ఆత్మహత్యా యత్నానికి కూడా కేడర్ పాల్పడుతున్నారు.  29వ వార్డుకు చెందిన వైసీపీ నేత పీతల వాసు ఆత్మహత్యాయత్నం చేశాడు.

 

కొందరు వైసీపీ  తూర్పు ఇంచార్జి ఇంటికి వెళ్ళి ఆందోళన చేపట్టారు. మరి కొందరు రెబెల్స్ గా నామినేషన్లు వేశారు. ఈ సీన్ మొత్తం చూసిన టీడీపీకి ధైర్యం పెరిగింది.  ఇప్పటికి కూడా లిస్ట్ రిలీజ్ చేయకుండా జాగ్రత్త పడిన టీడీపీ వైసీపీ తప్పులను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. మొత్తానికి వైసీపీదే పై చేయి అన్న సీన్ నుంచి ఇపుడు పార్టీ గెలుస్తుందా అన్న దాకా నాయకులు వారం రోజుల్లోనే తెచ్చేశారు.

 

 

సీట్లు రాక రగిలిపోతున్న క్యాడర్ని బుజ్జగించి దారికి తెచ్చుకోకపోతే వైసీపీకి గెలుపు డౌటేనని అంటున్నారు. మళ్ళీ విశాఖ షాక్ ఇచ్చేలా ఉందని యాంటీ సెంటిమెంట్ ను  పార్టీ అభిమానులు  గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: