స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌ల్నాడులో క‌ల‌కం రేగిన సంగ‌తి. దీనిపై ఏపీలో అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. తాజాగా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మ‌రోమారు ఇదే అంశంపై స్పంఇంచారు. ``ప‌ల్నాడుపై చంద్రబాబు పగ బట్టారు. వైసీపీ ప్రభుత్వం అక్కడ ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేసింది. అదే చంద్రబాబు హయాంలో ఏం చేశారో ఒక్క పథకం గురించి చెప్పమనండి. ఇంత మెజారిటీతో జగన్‌గారికి గెలిపించారన్న కుళ్లుతో అలా చేస్తున్నారేమో అనిపిస్తుంది’ అని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

 


దీంతో పాటుగా, గ‌తంలో ఇప్ప‌టికీ ప‌రిస్థితిని మ‌హేష్ రెడ్డి వివ‌రించారు. ``40-50 ఏళ్ల క్రితం మంచి సంస్కృతి ఉండేదట. బ్రహ్మానందరెడ్డి, సంజీవయ్య, సంజీవరెడ్డి వంటి వారు ఉన్నప్పుడు చట్టసభల్లో ఒకరినొకరు ప్రశంసించుకునే వాళ్లు. లేదు ఏవైనా తప్పులు జరిగితే పోరాటాలు చేసే వాళ్లు. అలాగే అందరినీ కలుపుకుని పోయేవారు. ఇంతెందుకు రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నాయకులు ఎందరో వచ్చి తమ పనులు చేసుకుని పోయేవారు. నేను స్వయంగా ఎందరినో చూశాను’ అని కాసు మహేష్‌రెడ్డి తెలిపారు. 

 

కానీ చంద్రబాబు హయాంలో దానికి భిన్నంగా జ‌రిగింద‌ని కాసు మ‌హేష్ రెడ్డి తెలిపారు. ``ఎందుకో చంద్రబాబు సీఎం అయ్యాకే, సచివాలయం అంటే టీడీపీ ఆఫీస్‌. ముఖ్యమంత్రి అంటే కేవలం టీడీపీ కేడర్‌కు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారిపోయింది.  ఒకానొక సమయంలో వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వెళ్లి, మేము మా నియోజకవర్గాలలో పనులు చేయాలి. మాకూ గ్రాంట్లు ఇవ్వాలి అని అంటే, నథింగ్‌ డూయింగ్‌. నేను మా ఇంఛార్జ్‌లకే ఇస్తాను తప్ప, మీకు ఇవ్వను అన్నారు.``అంటూ మ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిని వివ‌రిస్తూ, ``జగన్‌మోహన్‌రెడ్డి కేవలం వైయస్సార్‌సీపీ నాయకులకు మాత్రమే ముఖ్యమంత్రి కాదు. యావత్‌ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. అంటే అన్ని పార్టీలను కలుపుకుని పోవాలి. ఎవరైనా మద్దతు ఇస్తే వాళ్ల మద్దతు తీసుకుని.. లేదు వాళ్లు సూచనలు, సలహాలు ఇస్తే.. అన్నీ నాకు తెలుసు. నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనే వ్యక్తి కాదు` అంటూ మ‌హేష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: