చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల చైనాలో 3000 లకు పైగా మరణించారు..అయితే ఇటీవల భారత్ లో కూడా వ్యాపించిన ఈ కరోనా ప్రజలు భపడుతున్నారు. ఈ మేరకు భారత్ కర్నాటకలో మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ అనే వృద్ధుడు కరోనా బారిన పడి మరణించాడు.అది భారత్ లో నమోదైన మొదటి కేసు అని చెప్పాలి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా వల్ల ఇప్పటికే వాణిజ్య వ్యాపారాల మూత పడిన సంగతి తెలిసిందే.. చైనా నుంచి వస్తున్నా పలు దిగుమతులను అన్నీ దేశాలు నిలుపుదల చేశారు.. 

 

 

 

కరోనా వైరస్ ఎలా వస్తుంది అనేది తెలియకుండా ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి..అయితే ఇప్పుడు యావత్ ప్రజలు కరోనా పై భయపడుతున్నారు ..ఇప్పటికే కొందరు సెలెబ్రెటీలు ఈ కరోనా వైరస్ వ్యాప్తిపై పలు విధాల జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు.. కొనేదల ఉపాసన, విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్ లు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియ జేశారు.. 

 

 

 

 

చేతుల ద్వారా ఎటువంటి రోగమైన కూడా తొందరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ వ్యాధిని అరికట్టాలంటే ముందుగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.. అలాగే జలుబు దగ్గు లాంటివి ఉన్న వాళ్లకు దూరంగా ఉండాలని సూచించారు.. తినే ఆహార పదార్థాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు.. ఇకపోతే ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పదార్థాలను తీసుకోవడం మంచిది కాదని అంటున్నారు... 

 

 

 

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా కారణంగా చాలా వరకు పాఠశాలలు కళాశాలలు మూసివేశారు... వినోదాన్ని పంచే సినిమా థియేటరలలో కూడా ఈ కరోనా వైరస్ కారణంగా సినిమా వేయడం కూడా నిలుపుదల చేశారు.. అయితే ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ లో హాస్టళ్లు కూడా మూసివేస్తారు యాజమాన్యాలు వెల్లడించడంతో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ బస్సులను బుక్ చేసుకుంటున్నారు.. మొత్తానికి కరోనా ప్రభావం కారణంగా ఎక్కడిక్కడ అన్నీ ఆగిపోవడంతో నష్టాల బాటలో రాష్ట్రాలు ఉన్నాయని స్టాక్ మార్కెట్ వెల్లడిస్తున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: