రాను రాను కుటుంబ సంబంధాలు మంటగలసిపోతున్నాయి. తాను, తన సుఖం తప్ప మనిషికి ఏమీ పట్టడం లేదు. ఇక అక్రమ సంబంధాల నేరాలైతే మరీ దారుణంగా ఉంటున్నాయి. సెక్స్ పిచ్చి పట్టిన వ్యక్తలు చివరకు వావి వరుసలు కూడా చూడటం లేదు. తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసిన ఓ ఘోరం సంగతి తెలిస్తే..అసలు ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని షాకవ్వక మానరు.

 

 

అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ మీర్‌పేట అల్మాస్‌గూడకు చెందిన వేలూరి అనిత కొన్నేళ్ల క్రితం భర్త బాబురావుతో విడిపోయింది. తన పిల్లలతో కలిసి విడిగా ఉంటోంది. అనిత క్యాటరింగ్‌ పనులతో జీవనం సాగిస్తోంది. ఆ పనులు చేసే సమయంలోనే ఆమెకు ప్రేమ్‌ నవీన్‌కుమార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఎలాగూ భర్త లేకపోవడంతో అనిత తక్కువ సమయంలోనే అతనికి ఆకర్షితురాలైంది.

 

IHG

 

ఆ పరిచయం కాస్తా.. అక్రమ సంబధానికి దారి తీసింది. చివరకు అతడిని వదిలి ఉండలేని స్థితికి చేరుకుంది. ఈ అక్రమ సంబంధాన్ని మరింత సులభంగా ఎలా కొనసాగించాలా అని ఇద్దరూ ఆలోచించారు. అందుకే.. నవీన్ కుమార్ తో పర్మనెంటుగా శృంగార కార్యకలాపాలు నిర్వహించుకోవాలంటే.. ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.

 

 

అందుకే.. ఏకంగా డిగ్రీ మొదటి సంవత్సరం చదివే తన పెద్ద కుమార్తె వందనను నవీన్‌కుమార్‌కు ఇచ్చి అనిత గత సంవత్సరం డిసెంబరు 1పెళ్లి చేసింది. అయితే వివాహమైన తరువాత కూడా నవీన్‌కుమార్‌ అనితల సెక్స్ ఎఫైర్ నిరాటకంగా కొనసాగేది. కానీ రంకు దాగుతుందా.. వాళ్లిద్దరి అక్రమ సంబంధం కూతురు వందన కనిపెట్టింది. లాభం లేదని మొగుడితో వేరు కాపురం పెట్టించాలని ప్రయత్నించింది. కానీ.. నవీన్ ఇంట్లో నుంచి వెళ్లిపోతే తాను చనిపోతానని తల్లి అనిత బెదిరించింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన వందన సూసైడ్‌నోట్‌ రాసి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: