కరోనా వైరస్ గురించి అసెంబ్లీ వేదిక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో జోక్ లు పేలుతున్నాయి . కరోనా వ్యాధికి పారా సిట్ మాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని తనకొక శాస్త్రవేత్త చెప్పారని అసెంబ్లీ లో కేసీఆర్ పేర్కొన్న విషయం తెల్సిందే . ఇక తెలంగాణ వాతావరణ పరిస్థితుల్లో కరోనా వైరస్ బతికి బట్ట కట్టే ఛాన్స్ కూడా లేదని  ఆయన అన్నారు . అయితే కరోనా వ్యాధి వల్ల దేశం లో ఇరువురు మృతి చెందడమే కాకుండా,  పదుల సంఖ్య లో  కేసులు నమోదవుతున్న తరుణం లో కేంద్రం తోపాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి .

 

విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి , సినిమా థియేటర్లు , మాల్స్ మూసివేతున్నట్లు ప్రకటించాయి . ఈ నేపధ్యం లో తెలంగాణ  అసెంబ్లీ లో కరోనా పై చర్చ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం కనీస ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని  కాంగ్రెస్ శాసనసభా పక్ష మల్లు భట్టి విక్రమార్క విమర్శిస్తూ ... అధికారులు సరైన చర్యలు తీసుకోవాలంటూ  సీఎం  కేసీఆర్ చెప్పాల్సిందిపోయి  , ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు . కేసీఆర్ ఒక భూతవైద్యుడి మాదిరిగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డ భట్టి విక్రమార్క , కరోనా కు పారా సెట్ మాల్ టాబ్లెట్   వేసుకుంటే సరిపోతుందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు . ఇక 27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే కరోనా దరిచేరదని , అంత ఎండలో వైరస్  చనిపోతుందని  అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చెప్పారని  గుర్తు చేశారు .

 

మరి కర్ణాటక కు చెందిన హుస్సేన్ సిద్ధిఖీ హైదరాబాద్ లోని అన్ని ఆసుపత్రుల్లో తిరిగి ఎందుకు చనిపోయారంటూ  ప్రశ్నించారు . భట్టి ప్రశ్నలకు కేసీఆర్ స్పందిస్తూ తనకొక శాస్త్రవేత్త కరోనాకు  పారా సెట్ మాల్ వేసుకుంటే, జ్వరం తగ్గిపోతుందని చెప్పారని పేర్కొని తన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు  . అయితే కరోనా తీవ్రత ను ముందుగా గుర్తించడం లో సీఎం కేసీఆర్  ఘోరంగా విఫలమయ్యారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి . ఇతర రాష్ట్రాలు అప్రమత్తం కావడం తో , ఇప్పు డు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయి, నివారణ చర్యలు చేపడుతోందని అంటున్నారు  . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: