ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి పైచేయి సాధించినట్లు కనబడుతోంది. చాలాకాలం తర్వాత ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండగా టిడిపి నుంచి అధికార పార్టీ వైసీపీ లోకి పెద్ద ఎత్తున చేరికలు సాగుతున్నాయి. అది కూడా టిడిపి బలంగా ఉన్న ప్రదేశాల్లో అతి ముఖ్యమైన నాయకులు తరలిపోవడంతో చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. అయితే టిడిపి చేతిలో ఉన్న చాలా సంస్థలు వైసీపీకి దాసోహం అవుతుంటే చూస్తూ ఉండడం చంద్రబాబు వంతయింది. ఇదే క్రమంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టిడిపి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం అయిపోయింది.

 

మొత్తం కోపంలో 95 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటిలో ఏకంగా 76 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన స్థానాలన్నీ వైసీపీ ఒళ్ళోకి చేరడం విశేషం. టిడిపికి ఒక్కట్టంటే ఒక్క స్థానం కూడా దక్కలేదు. అయితే నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉన్న నేపథ్యంలో 19 స్థానాల్లో అయినా టిడిపికి వైసీపీకి మధ్య పోరు ఉంటుందా లేకపోతే అవి కూడా చివరికి వైసీపీ ఖాతాలోకి పడిపోతాయా అన్నది ఇక్కడ ఆసక్తికర చర్చ.

 

చంద్రబాబు మరియు టిడిపికి కంచుకోటగా ఉన్న కుప్పంలో అసలు లెవెల్ లో ఏకగ్రీవం అసలు ఎలా జరిగిందని రాజకీయ పండితులు సైతం తలలు గోక్కుంటూ ఉన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ దౌర్జన్యానికి పాల్పడి ఉంటే... ఇప్పుడు బరిలో నిలిచిన 19 మంది టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఎలా నామినేషన్ వేయగలిగారన్నది వైసీపీ ప్రశ్నగా వినిపిస్తున్న మాట.

 

నిజమే... 76 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ... 19 స్థానాలను ఎందుకు వదిలేస్తుంది? అంటే... టీడీపీ నేతలే వైసీపీ ప్రభంజనం ముందు నిలవలేక నామినేషన్లు వద్దనుకుని తప్పుకున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం వారి మదిలో తొలుస్తున్నాయి. ఏది ఏమైనా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 95 స్థానాలకు గాను 76 స్థానాలు వైసీపీ ఖాతాలో పడ్డాయంటే నిజంగానే... అక్కడ టీడీపీ చిత్తు చిత్తుగా ఓడినట్టేనన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: