ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వారం తెలుగుదేశం పార్టీకి కాస్త కష్టంగానే గడిచింది అనే చెప్పాలి. రాజకీయంగా బలహీనంగా ఉన్న ఆ పార్టీకి ఈ వారం పరిణామాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల కేంద్రంగా ఆ పార్టీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుక్కలు చూపిస్తున్నారు. అధికార పార్టీ నుంచి తన మనుగడ కాపాడుకోవడానికి టీడీపీ నానా రకాల ప్రయత్నాలు చేసింది. మాచర్ల నియోజకవర్గ౦లో దాడులకు గురైన వారిని పరామర్శించడానికి గాను వెళ్ళిన టీడీపీ నేతలపై దాడులు జరిగాయి. 

 

బుద్దా వెంకన్న, బొండా ఉమాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ నేతలకు, వారితో పాటు వెళ్ళిన లాయర్ కి గాయాలు అయ్యాయి. ఇక ఆ తర్వాతి నుంచి టీడీపీ నేతలు, పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డీజీపీ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. దాడులకు గురైన నేతలను తీసుకుని ఆయన డీజీపీ ఆఫీస్ వద్దకు వెళ్ళారు. అదే విధంగా పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసారు. 

 

రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతుంది అంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేసారు. తమ మనుగడ కాపాడుకోవడానికి అధికార పక్షాన్ని, ఎన్నికల సంఘాన్ని, పోలీస్ వ్యవస్థను చంద్రబాబు గట్టిగానే టార్గెట్ చేసారు. ఇక అది ఎంత వరకు ఫలించిందో ఏమో స్థానిక సంస్థల ఎన్నికల్లో చూడాలి. పలువురు నేతలు పార్టీ మారారు కూడా. కీలక నేతలుగా ఉన్న వాళ్ళు కొందరు పార్టీ మారడానికి రెడీ అయ్యారు ఈ వారం. వారిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కీలకంగా చెప్పుకోవచ్చు. చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న కరణం బలరాం పార్టీ ,మారడం ఆ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: