ఈ వారం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పరిణామాలు ఏమీ జరిగకపోయినా కరోనా వైరస్‌కు సంబందించిన వార్తలే ప్రధానంగా వినిపించాయి. ఇప్పటికే తెలంగాణ రెండు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా చాలా మంది అనుమానితులు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో పలు రూమర్స్‌ కూడా పెద్ద ఎత్తున హల్‌ చల్‌ చేస్తున్నాయి. అనుమానితుల సంఖ్యను పెంచేస్తూ భారీగా రూమర్స్‌ ను ప్రచారం చేస్తున్నారు.


అయితే ఈ విషయంలపై తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలతో పాటు పార్క్‌ లు, పబ్‌ లు, ఫంక్షన్‌ హాల్స్‌, ఇతర ఎంమ్యూజ్‌ మెంట్‌ పార్కులు అన్ని ఉన్నపళంగా మూసి వేస్తున్నట్టుగా ప్రకటించారు. అదే సమయంలో తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు  రెడీ అవుతున్నారు.

 

ఇక ఈ వారం ప్రధానంగా వినిపించిన మరో తెలంగాణ వార్త కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డికి సంబంధించింది. టీ ఆర్‌ ఎస్‌ ను ఎదుర్కొనే దమ్మున్న నాయకుడిగా పేరున్న రేవంత్‌ రెడ్డి ఈ వారంలో గట్టిగానే చిక్కుల్లో పడ్డాడు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కు సంబంధించిన ఓ ఫాం హౌస్‌ పై సరైన పర్మిషన్‌ లు లేకుండా డ్రోన్‌ ఎగరవేసినందుకు గానూ రేవంత్‌ రెడ్డిపై కేసు నమోదైంది.

 

అయితే తనపై అక్రమ కేసు పెట్టారంటూ స్వయంగా పోలీసుల ముందుకు లొంగిపోయిన రేవంత్‌ కు కోర్టు గట్టి షాకే ఇచ్చింది. రేవంత్‌కు బెయిట్ ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే రేవంత్ చర్యలపై సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. హనుమంత రావు లాంటి వారు బహిరంగం గానే విమర్శిస్తుంటే మరికొందరు మాత్రం లోపల లోపల రాజకీయాలు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: