ఏపీ స్ధానిక ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. అయితే.. ఈ ఎన్నికల నేపథ్యంలో అక్కడక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా., పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జిల్లాలో ఘటన రాష్ట్రంలోనే కాక పలు ప్రాంతాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. నగరపాలక సంస్దకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపధ్యంలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్ధుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఐదుగురు కార్పోరేటర్ అభ్యర్ధులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది.

 

 

ఏపీలో స్ధానిక ఎన్నికల్లో భాగంగా ప.గో జిల్లాలోని ఏలూరుకు పురపాలక ఎన్నికలు నిర్వహించారు. అయితే.. అసలు విషయం ఇక్కడే మొదలయింది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఏదో రకంగా స్ధానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం  అయిన ఆళ్లనానిని తనవైపు తిప్పుకుని చేసుకుని చాలా మంది అభ్యర్థులు కార్పోరేటర్ సీట్లు సంపాదించారు. ఇక కార్పొరేటర్ పదవులు పొందిన వారు ఇప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం పోటీ పడటం మొదలుపెట్టారు.

 

 

గతంలో ఉన్న మేయర్ అయిన షేక్ నూర్జహాన్ కు వైసీపీ మరోసారి అవకాశం కల్పించింది. అయితే ఈ పదవి కోసం చివరి నిమిషం వరకూ నువ్వా.. నేనా అంటూ పోటీ పడ్డారు. చివరి నిమిషంలో నూర్ ను మేయర్ గా ఛాన్స్ ఇచ్చారు. కానీ.. మేయర్ పదవికి బొద్దాని శ్రీనివాస్ బాగా ప్రయత్నించారు. ఈయన ఒకానొకప్పుడు డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఇంటి ముందే ధర్నాకు దిగేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని ఆయన్ను అక్కడి నుంచి తరలించారు. 

 

 

 

ఏలూరు మేయర్ వైసీపీ అభ్యర్ధిగా నూర్జహాన్  కావటంతో ఇక అభ్యర్థుల చూపు మొత్తం డిప్యూటీ మేయర్ పై పడింది. దీంతో అక్కడ కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటగా మేయర్ గా 7గురు ప్రయత్నించారు. అభ్యర్థుల వడపోత కార్యక్రమం పట్టి 7గురు నుంచి 5 గురుగా చేశారు. ఆ తర్వాత ఎవర్ని తీసివేయాలో అర్దం కాక వారిని అలానే ఉంచారు. డిప్యూటీ మేయర్ గా ఐదుగురిని ప్రకటించారు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. 

 

 

డిప్యూటీ మేయర్ లుగా ఎంపికైన వారిలో బొద్దాని శ్రీనివాస్ భార్య జయశ్రీ, సుధీర్ బాబు, గుడిచేసి శ్రీనివాసరావు, పిల్లంగోళ్ల శ్రీదేవి, పైడి భీమేశ్వరరావు ఉన్నారు. వైసీపీ గెలిస్తే వీరంతా వరుస క్రమంలో ఏడాది పాటు మేయర్లుగా వ్యవహరిస్తారు. వీరి మధ్య ఎలాంటి వివాదాలు చోటుచేసుకోకుండా ఏడాది పదవి పూర్తి చేసుకున్న తర్వాత వీరంతా పదవుల నుంచి తప్పుకోవాలని డిప్యూటీ సీఎం ఆళ్లనాని వీరికి నిబంధన పెట్టారు. అయితే.. ఇప్పుడు ఇది       చర్చాంశనీయంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: