కరోనా కనికరం లేని వైరస్. దీనికి చిన్నా, పెద్దా, ఆడ, మగ, ధనికులు, పేదలు అనే బేధం లేదు. ఎవరికన్నా వ్యాపిస్తుంది. ఇప్పుడు ప్రపంచాన్ని అంతటిని  వణికిస్తున్నది  ఏది అంటే కరోనా వైరస్.. చైనా లో విజృంభించి మెల్ల మెల్లగా ప్రపంచ దేశాలన్నీ చుట్టూ ముట్టి అనేక మంది ప్రాణాల్ని భలి తీసుకుంటుంది. అంతేకాకుండా మన భారత దేశంలోకి కూడా కరోనా వచ్చేసింది.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గాని వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేక పోయాము.

 

అయితే  ఇప్పుడు కరోనా వైరస్   తెలంగాణ రాష్ట్రంలోనూ  కలకలం రేపుతోంది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డిశ్చార్జ్ అయిన 24 గంటల్లోపే మరో కేసు నమోదైంది. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చెందిన ఓ యువతికి కరోనా సోకిందని వైద్యులు తెలిపారు. జిల్లాలో తొలి కరోనా వైరస్‌ నమోదు కావడం కలకలం రేపింది.

 

అసలు వివరాలలోకి వెళితే. అశ్వారావుపేట మండలానికి చెందిన స్నేహ అనే యువతికి కరోనా పాజిటివ్‌ వచ్చినదని వైద్యులు నిర్ధారించారు. అశ్వరావుపేటకు చెందిన యువతి కి 24 సంవత్సరాలు. మార్చి 7న ఇటలీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చింది.వచ్చిన తర్వాత  నేరుగా తన ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత జలుబు, దగ్గు, జ్వరం రావడంతో మార్చి 9న మణుగూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. అయినా.. తగ్గక పోవడంతో మార్చి 10న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. ఈ కేసు గురించి తెలుసుకున్న భద్రాచలం జిల్లా హెల్త్ అధికారి కరోనా లక్షణాలుగా అనుమానించి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి స్నేహ ని  రెఫర్ చేశారు. ఆమెను మార్చి 11న గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు.

 

యువతి నమూనాలను పరీక్షలకు పంపించిన గాంధీ వైద్య సిబ్బంది.. ఆమెకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారించారు. ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలో కరోనా బయటపడడంతో  వైద్య ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా ఆ యువతి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు..ఆ యువతీ కి  మెరుగైన వైద్యం కోసం జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు యువతిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  ఈ విషయం తెలియడంతో కొత్తగూడెం జిల్లాలో ప్రజలు బయటకి రావాలన్న, ఎవరితో అన్న మాట్లాడాలన్నా బయ పడిపోతున్నారు. వైద్య అధికారులు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారినుండి బయటపడవచ్చని చెప్తున్నారు.. వ్యాధి వచ్చాక బాధ పడడం కంటే రాకముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కదా !!

మరింత సమాచారం తెలుసుకోండి: