ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపైనా, పోలీసులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ముఖ్య నేతలు పార్టీ మారడంపై ఆయన మాట్లాడుతుంటే నవ్వొస్తుందని.. గతంలో ఆయన చేసిన దానికి ఏమని అడగాలని అన్నారు.  ఎన్నికల్లో తాము ఓడిపోతామని తెలిసి రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి కంకణం కట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు మామూలు సంఘటనలను చూపి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

 

చంద్రబాబు నాటకాలు, కుయుక్తులను ఎవరూ నమ్మొద్దని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు.  ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగటం లేదని, శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతోందని బాబు నిందారోపణలు చేస్తున్నారు.  అసలు గొడవలు చేస్తుందే వారని.. అధికార పార్టీ ఇలాంటి చిల్లర పనులు చేయాల్సిన ఖర్మ ఏంటీ అని ప్రశ్నించారు.  చిన్న చిన్న ఘటనలు మినహా రాష్ట్రమంతటా శాంతియుతంగానే ఎన్నికల ప్రక్రియ సాగుతోంది.    చంద్రబాబు పాలనతో పోల్చుకుంటే 99 శాతం ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. చంద్రబాబు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటిస్తాం.

 

ఆయన తానా అంటే పవన్‌ కల్యాణ్‌ తందానా అంటున్నారు. వీరిద్దరూ దొందూ దొందే అని అన్నారు. ప్రజల్లో నమ్మకం లేని నాయకులు పనికట్టుకొని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌ సీపీకి పట్టం కట్టడం ఖాయం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. సీఎం జగన్‌ ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి’ అని అన్నారు.  అందుకే ఆయన పాలన మెచ్చి తమ పార్టీలోకి వస్తున్నారని..ఇది జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు.  ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించటమే సీఎం వైఎస్‌ జగన్‌ ధ్యేయమని చెప్పారు. పచ్చ నేతలకు లోకమంతా పచ్చగా కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదని వ్యాఖ్యానించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని బొత్స ఆరోపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: