ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నేప‌థ్యంలో ప‌లుచోట్ల ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అధికార వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య వార్ న‌డుస్తోంది. 
నేటితో నామినేషన్ల గ‌డువు ముగియ‌నుండ‌టంతో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్తత నెలకొంది. కాగా.  కాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. దీంతో ఆయా పార్టీ నేతలు అంతా ప్రచారం పై దృష్టి పెట్ట‌నున్నారు.  ప్రకాశం జిల్లా చీరాలలో లాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి మధ్య వార్ నడిచింది. ఇరు వర్గాలు పోటాపోటీగా మోహరించడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.


ఇదిలా ఉంటే తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పై టీడీపీ నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెద్దిరెడ్డి పై చర్యలు తీసుకుంది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని మార్చి 15వ రోజున ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కేతిరెడ్డి పెద్దిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలోని వారికి మార్చి 8న చీరలు, దుస్తులు పంచి పెట్టినట్లు ఫిర్యాదు వచ్చిందని.. దీంతో ఆయ‌న‌పై చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ తెలిపారు.

కాగా.  రాష్ట్రంలో ఈ నెల 7 నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్ర యత్నం చేయ్యడం తీవ్రంగా పరిగణించామన్నామని రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే.. ఆ ఉల్లంఘన కింద ప్రాసిక్యూషన్ చేస్తామన్నారు. దీంతో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై ఒక రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఆంక్షలు విధించారు.

తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో చీరలు పంచిపెట్టిన ఘటనపై ఎన్నికల సాధారణ పరిశీలకులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి శ్రీరాముల పేటలో అక్కడి వాసులను అడిగి ఎన్నికల కమిషన్ కు వచ్చిన ఫిర్యాదు వాస్తవమా.. కాదా..??  అని వాస్తవాలను నిర్ధారించుకున్నామని అన్నారు ఎన్నికల కమిషనర్ రమేష్‌ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: