జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ హాస్పిటల్ లో మన భారత డాక్టర్లు ప్రపంచం మొత్తానికి అంతుచిక్కకుండా తనదైన శైలిలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను విజయవంతంగా నాశనం చేశారు. జైపూర్ లో కరోనా సోకి ఉన్న ఒక ఇటాలియన్ జంట హాస్పిటల్ లో చేరగా వారికి ఒక కాంబినేషన్ లో మందులు ఇచ్చి నయం చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. భారతదేశానికి టూర్ కోసం వచ్చిన 23 మంది ఇటాలియన్ సభ్యులలో ఒక జంటకు కరోనా ఉన్నట్లు గుర్తించిన భార్యాభర్తలకు భారత డాక్టర్లు అనూహ్యరీతిలో నయం చేశారు.

 

కరోనా లాగే ఎప్పటి నుండో శాస్త్రవేత్తలకు అంతుచిక్కకుండా ఉన్నా హెచ్ఐవి కి వాడే మందులను కరోనా నయం చేయడానికి వాడగా అది కాస్తా విజయవంతం అయ్యింది. డాక్టర్లు లోపినవిర్ మరియు రిటోనవిర్ మందులను ను దానితో పాటు వారు మలేరియా కోసం వాడే క్లోరోక్విన్ మరియు స్వైన్ ఫ్లూ ట్రీట్మెంట్ కు వాడే ఒసెళ్తామివిర్ నో కూడా కలిపి ఇవ్వడంతో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడి చివరికి నయం కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.

 

ఈ నెల 3వ తేదీన కరోనా ఆ జంటలోని భర్తకి ఉన్నట్లు తెలియగా పక్క రోజు అతని భార్య కూడా కరోనాపాజిటివ్ అని తేలింది. ఇప్పుడు రాజస్థాన్ డాక్టర్లను సంప్రదించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కరోనా బాధితులందరికీ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మిగతా దేశాలు కూడా సన్నాహాలు జరుగుపుతున్నాయి. ఇకపోతే ఆ కాలేజీ ప్రిన్సిపల్ మరియు కంట్రోలర్ అయినా సుధీర్ బండారి మాట్లాడుతూ మేము ఏమి అద్భుతం చేయలేదని.... ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు దానికి కారకమైన క్రిమి స్వభావానికి అనుగుణంగా ఎలా ట్రీట్ చేయాలో ఉండే ఒక నిర్దిష్టమైన ప్రోటోకాల్ పాటించడం వల్ల అది కొద్ది రోజులకి వైరస్ నెగిటివ్ అని తేలడం చాలా గొప్ప ఘనత అతని హాస్పిటల్ లోని డాక్టర్లను కొనియాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: