ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి చెందటంతో భారత్ జాతీయ విపత్తుగా ప్రకటించారు. ఈ మహమ్మారి వలన ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 5,835 మంది చనిపోయారు. అలాగే.. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1,56,000. ఈ  వైరస్‌ ను అదుపుచేయడానికి వివిధ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కరోనా చైనాలో తగ్గుముఖం పడుతుండగా.. వేరే దేశాలలో వైరస్ దాడి ఉదృతంగా ఉంది. ఇప్పటికే కోవిడ్ ను అమెరికా జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించింది. ఇటలీలో కరోనాఉదృతంగా ఉంది. కరోనా దాటికి శనివారం 175 మంది బలయ్యారు. ఇంకా కొత్తగా 3,497 మంది కరోనా బాధితులుగా గుర్తించారు. ఇటలీలో ఇప్పటి వరకు 1,441 మంది కరోనా వైరస్ వలన మరణించారు. మొత్తం కరోనా  కేసుల సంఖ్య 21,157కి చేరిందని ఇటలీ ప్రభుత్వం పేర్కొంది.


కరోనాతో ఇరాన్‌ లో కూడా నిన్నటి రోజున 97 మంది చనిపోగా, 1,365 మంది కరోనా బారిన పడ్డారు. ఇక స్పెయిన్‌ లో కూడా కరోనా వైరస్ ఉగ్ర రూపం దాల్చుతుంది. స్పెయిన్‌ లో ఇప్పటి వరకు 197 మంది చనిపోయారు. గడిచిన 24గంటల్లోనే 1,500 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో వైరస్‌ బాధితుల సంఖ్య 5,753కు చేరుకుంది. ఇదిలా ఉండగా.. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ భార్యకు కరోనా ఉన్నట్టు నిర్దారణ పరీక్షల్లో తేలింది. ప్రధాని భార్య బెగొనా గొమేజ్‌కు కోవిడ్ ఉన్నట్లు స్పెయిన్ ప్రధాన మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుతం పీఎం భార్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రధానికి కోవిడ్ సోకలేదని తెలిపింది.  

 

స్పెయిన్‌లో భాదితుల సంఖ్య ఎక్కువగా ఆ దేశ రాజధాని మాడ్రిడ్‌ లోనే ఉన్నట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. మరణాల సంఖ్య ఎక్కువవుతుండటంతో ఆ దేశ కాబినెట్‌ అత్యవసరంగా సవవేశం ఏర్పాటు చేసింది. మరోవైపు, భారత్‌ లో కేసులు పెరుగుతుండటంతో పలు దేశాల నుండి వచ్చేవారికి కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన సూచనలు, సలహాలు చేసింది. ఇప్పటికే జారీచేసిన వీసాలను ఏప్రిల్ 15 వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పర్యటన అత్యవసరమైతే మాత్రం భారతీయ కాన్సులేట్‌ లేదా రాయబార కార్యాలయాలను సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: