కరోనా మహమ్మారి పేద, ధనిక, చిన్న, పెద్ద, రాజకీయ నాయకులు, క్రీడాకారులు అని తేడా లేకుండా విజృంభిస్తున్న తీరు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతోంది. అయితే ఇప్పటికే కెనడా దేశ ప్రధాని యొక్క భార్యకు కరోనా పాజిటివ్ అని రావడం మరియు ఆస్ట్రేలియాలో కూడా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి కరోనా లక్షణాలు వస్తే పరీక్షలు చేసినప్పుడు అతనూ పాజిటివ్ అని తేలడంతో ముందు రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పట్టుకుంది. అయితే ఇదే వరుసలో అమెరికా ప్రధాని డొనాల్డ్ ట్రంప్ కు శ్వేత సౌధంలో శనివారం సాయంత్రం కరోనా టెస్ట్ జరిగింది.

 

ట్రంప్ యొక్క రక్త నమూనాలను డాక్టర్లు ల్యాబ్ కు తీసుకు వెళ్లి ఒక రోజంతా అతి జాగ్రత్తగా పరీక్షలు జరిపారు. ట్రంప్ దీనిపై మాట్లాడుతూ తాను ప్రజల ముందుకు వెళ్లి మాట్లాడే ముందుగా తాను కూడా టెస్ట్ చేయించుకుని వెళ్తే వారికి ధైర్యంగా ఉంటుందని మరియు అతనికి చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పాడు. పక్క రోజు ప్రెస్ కాన్ఫెరన్స్ పెట్టుకొని ముందు రోజు ట్రంప్ ఇలా కరోనా టెస్ట్ చేయించుకోవడం అందరిలో అమితాసక్తిని రేపింది. ఒకే ఒక్క రోజులో రావాల్సిన ఫలితాలు కాస్తా మరొక రోజు ఆలస్యం అయ్యేసరికి అసలు ఏమైంది అని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు.

 

చివరికి కొద్ది గంటల క్రితమే ల్యాబ్ నుండి రిపోర్టులు రాగా అందులో ట్రంప్ కు కరోనా నెగిటివ్ అని తేలింది. దీనితో అమెరికా ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. అగ్రరాజ్యపు అధినేత అని చెప్పి ఒకటికి రెండుసార్లు సమయం వెచ్చించి మరీ సైంటిస్టులు అతని రక్త నమూనాలు పరిశోధించారు. అందుకే ఆలస్యం అయినట్లు కూడా వారు తెలపడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: