కరోనా పేరు వింటేనే యావత్ ప్రపంచం బయపడి పోతుంది. చైనా దేశంలో విజృభించి మెల్ల మెల్లగా ప్రపంచ దేశాలన్నిటిని చుట్టుముట్టింది..ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మన భారత దేశంలోకి వచ్చేసింది. నిన్న కాకా మొన్న తెలంగాణా కొత్తగూడెం లో ఒక 24 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ వచ్చింది.. కరోనా భయంతో బయటకి వెళ్లాలన్న, ఎవరితో అన్న మాట్లాడాలన్నా బయపడి పోతున్నారు జనాలు. అయితే కరోనా కారణంగా రైల్వే డిపార్ట్మెంట్ ఒక నిర్ణయం తీసుకుంది.

 

IHG

 

 ప్రయాణికుల సురక్షితం కోసం ఒక మంచి ఆలోచన చేసింది. అది ఏంటంటే  ప్రయాణికులు ఎవరికి వారే వారి సొంత బ్లాంకెట్లను వారి వెంట  తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఎవరికీ వారు తెచ్చుకుంటే ఒకళ్ళ నుంచి వేరే వారికీ వైరస్ వ్యాప్తి అనేది కొంచమన్న తగ్గుతుందని వారి అభిప్రాయం. మాములుగా అయితే ఏసీ బోగీల్లో ప్రయాణికులకు రైల్వే వాళ్ళే బ్లాంకెట్స్ సదుపాయాలు కలిపిస్తారు. కానీ కరోనా వ్యాప్తి చెందడంతో ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు కర్టెన్లతో పాటు బ్లాంకెట్లను కలిపించే సదుపాయాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు రైల్వే పీఆర్వో ప్రకటించారు.

 

IHG

 

 ఏసీ బోగీల్లో వినియోగించే కర్టెన్లు, బ్లాంకెట్లను ఓ ట్రిప్ పూర్తి కాగానే ఉతికి శుభ్రపరచడానికి వీలుండదని, ఈ కారణంతో వైరస్ సోకే ప్రమాద ముందని ఆయన తెలిపారు. కేవలం బ్లాంకెట్లు మాత్రమే కాకుండా, ప్రయాణికులకు అవసరమైన దుప్పట్లు, ఇతరత్రా వాటిని ఎవరికి వారే తెచ్చుకోవాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.. ముందు జాగ్రత్త కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే శాఖ తెలిపింది. రైల్లో ఎంతోమంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారు  అందులోను రద్దీ ఎక్కువ అండ్ జనసమూహం కూడా ఎక్కువ.. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలిసి ఉంటుంది.వ్యాధి నిర్ములన చాలా ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: