కరీంనగర్ ఐటీ టవర్‌పై ప్రారంభోత్సవం వాయిదాల మీద వాయిదా పడడానికి కారణమేంటి? మంత్రి గంగుల కమలాకర్ పెడుతున్న ముహూర్తాలే, ఇందుకు కలిసి రావడం లేదా ? ఇంతకూ ఐటి టవర్ ఓపెనింగ్ కు ముహూర్తం ఎప్పుడన్న చర్చ జిల్లాల్లో హాట్ హాట్‌గా నడుస్తోంది.


కరీంనగర్ మణిహారంలా భావిస్తున్న ఐటీ టవర్ ప్రారంభోత్సవం .. వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ముహూర్తం పెట్టిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి వస్తుండటంతో..  ప్రారంభోత్సవం కాకుండా ఆగిపోతోంది. స్థానిక మంత్రి గంగుల కమలాకర్ ఐటి టవర్ పై  ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ... ఐటీ టవర్ ప్రారంభం కావడం లేదు. ఐటీ టవర్‌కు వస్తున్న కొన్ని కంపెనీలు..  కాస్త నిరాశకు లోనవుతున్నట్లు తెలుస్తోంది.. ప్రారంభోత్సవం గ్రాండ్ గా ఉంటే.. పెట్టిన కంపెనీలకు సైతం ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుంది. స్మార్ట్ సిటీ గా ఉన్న కరీంనగర్ ఇమేజ్ కూడా పెరుగుతుంది. అటు ప్రభుత్వం కూడా ఇన్ని కంపెనీలు తెచ్చాం. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పుకోవడానికి కూడా వీలుంటుంది. వరుసగా నాలుగు సార్లు వాయిదా పడి ప్రారంభోత్సవం కాకపోవడంతో... ఐటీ టవర్ పై అనుకున్నంత జోష్ జనాల్లో రావడం లేదు.

 

మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయితే అధికారికంగా పని చేసుకునే వాతావరణం ఉంటుందనేది కంపెనీ ప్రతినిధుల ఆలోచనగా తెలుస్తోంది. ఐటీ టవర్ ప్రారంభోత్సవం ఇప్పటికే  మూడు సార్లు వాయిదా పడింది. 2019 దసరాకే ఐటీ టవర్ ప్రారంభిద్దామని, అప్పటి వరకు టవర్ నిర్మాణ పనులు పూర్తి  చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు మంత్రి గంగుల....అయితే జూలై, ఆగస్టులో పడ్డ భారీ వర్షాల వల్ల నిర్మాణ పనులు కాస్త ఆలస్యం అయ్యాయి. ఆ తర్వాత ఐటీ టవర్ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీంతో మళ్లీ డిసెంబర్ 30న ఐటీ టవర్ ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిద్దామని ప్లాన్ చేశారు. ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులను పిలిచి గ్రాండ్ గా వేడుక చేద్దామని భావించారు.

 

ఐటీ టవర్ ప్రారంభించుకుంటే మున్సిపల్ ఎన్నికల్లోనూ కొంత పాజిటివ్ అట్మాస్పియర్ ఉంటుందని ఆలోచించారు గులాబీ నేతలు. అయితే మున్సిపల్ ఎన్నికల కోడ్ కాస్త ముందే కూయడంతో ఐటీ టవర్ ప్రారంభోత్సవం ఆగిపోయింది. ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఫిబ్రవరి 18న మళ్లీ ఐటీ టవర్ ముహూర్తం ఖరారు చేశారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఐటీ టవర్ ను  పలుసార్లు పరిశీలించారు. పట్టణ ప్రగతికి సంబంధించిన మీటింగ్... సీఎంతో హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. దీంతో ఐటీ టవర్ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. మార్చిలోనే పెట్టుకుందామని ఆలోచన చేసినప్పటికీ , ముహూర్తం మాత్రం ఫిక్స్ కాలేదు. బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నందున ... అది కాస్త  ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: