అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించారు. అయితే.. ఇప్పుడు ఆయనకు కరోనా సోకిందా లేదా అని ఉత్కంఠ నెలకొంది. దీంతో.. ఆయనను పరీక్షించిన వైద్యులు కరోనా వైరస్‌ నెగెటివ్‌ వచ్చినట్టు  వెల్లడించారు. కాగా., ట్రంప్ కు శుక్రవారం రాత్రి ఆయన వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే.. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారోతో సహా ఆయన కమ్యూనికేషన్‌ చీఫ్‌ ఫాబియోతో భేటీ అయ్యారు. కాగా., బ్రెజిల్ ప్రతినిధి బృందంలో ఈ వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. 


దీంతో.. మార్చి 7న ఫ్లోరిడా రిసార్ట్‌ కు వచ్చినప్పుడు వారితో సన్నిహితంగా ఉన్నారని, అక్కడే ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపించి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే.. ట్రంప్ కు వారం రోజుల అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే.. మరికొంత మంది ఇంకా నిర్దారణ పరీక్ష ఫలితాల కోసం వేచిచూస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ కు నిర్వహించిన వైద్య నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. 24 గంటలలోపే ఫలితాలు రావడం విశేషం.


 కాగా., మరోవైపు బోల్సోనారోకు జరిపిన పరీక్షల్లోనూ నెగెటివ్‌ రావడం గమనార్హం. ఇప్పటివరకు అమెరికాలో కరోనా వైరస్‌ తో బాధపడుతూ 51 మంది మరణించారు. కాగా., కరోనా వైరస్ ధనిక, పేద అని లేకుండా సోకుతోంది. అయితే.. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భార్య సోఫీకి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ ఆయన విషయం తెలిసిందే. 


అలానే కరోనా స్పెయిన్‌ ప్రధాని భార్యకు సోకింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రధాని పెడ్రో శాంచెజ్‌ కార్యాలయం శనివారం వెల్లడించింది. ఆ దేశంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశాలను జారీ చేశారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కారోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1,56,000 లు ఉండగా., వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 5,835 కు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: