శృంగారం అనేది ప్ర‌తి మ‌నిషి జీవితంలో ఎంతో అవ‌స‌ర‌మైన‌ది. అయితే కొంద‌రు భార్యా భ‌ర్త‌లు మాత్రం ఏదో ఒక లోపంతో శృంగారానికి దూరంగా ఉంటుంటారు. అది మంచి ప‌ద్ధ‌తి కాదంటున్నారు నిపుణులు. కొంత మంది ఏవేవో చిన్న చిన్న కార‌ణాలు పెట్టుకుని సెక్యువ‌ల్ లైప్‌కి దూరంగా ఉంటుందారు. కొంత మంది ప‌ని ఒత్తిడి వ‌ల్ల పెద్ద‌గా దీని మీద ఆశ‌క్తి చూపించ‌రు. మ‌రికొంత మంది లైఫ్ పార్ట‌న‌ర్ బాలేద‌నో లేక సెక్స్‌మీద లేనిపోని అపోహ‌ల‌తో.. లేదంటే త‌మ భాగ‌స్వామిని తృఫ్తిప‌ర‌చ‌డంలేద‌నే  అప‌న‌మ్మ‌కాల‌తో ఇలా సెక్స్‌కి దూరంగా ఉంటుంటారు చాలా మంది.

 

అయితే అవ‌న్నీ స‌రైనా ప‌ద్ధ‌తులు కాదు అంటున్నారు వైద్య నిపుణులు. సెక్స్‌లో ఎక్కువ‌గా గ్యాప్ రావ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఇమ్యూనిటీ రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోతుంది అంటున్నారు. సెక్స్ అనేది మ‌నిషికి, మ‌న‌సుకి ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది అంతేకాక శ‌రీరానికి అది ఒక ఎక్స్‌ర్‌సైజ్‌లా ప‌ని చేస్తుంది. అయితే స్త్రీలు సెక్స్‌కి దూరంగా ఉండ‌డం వ‌ల్ల అధిక ఒత్తిడికి గుర‌వుతారు. అంతేకాక‌క కొన్ని కండ‌రాల వ‌ద్ద ర‌క్త ప్ర‌స‌ర‌ణ అనేది ఆగిపోతుంది. ఒక‌సారి అలా ఎక్కువ గ్యాప్ తీసుకుని త‌ర్వాత సెక్స్‌లో పాల్గొన్నా కూడా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు అంటున్నారు నిపుణులు.

 

అలాగే మ‌గ‌వారు సెక్స్‌కి దూరంగా ఉంటే గ‌నుక త‌ర్వాత ఫ్యూచ‌ర్‌లో అంగ‌స్థంభ‌న ఇబ్బందులు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని వైద్య నిపుణులు చెపుతున్నారు. చాలా మంది చిన్న చిన్న గొడ‌వ‌ల వ‌ల్ల కూడా శృంగానికి దూరంగా ఉంటుంటారు. ఆలా చేయ‌డం వ‌ల్ల కూడా ఆరోగ్య ప‌ర‌మైన ఇబ్బందులు వ‌స్తాయి అంటున్నారు. అంతే కాక భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య అన్యోన్య‌త‌ను గొడ‌వ‌ల‌ను తొల‌గించ‌డానికి సెక్స్ అనేది కీల‌క పాత్ర వ‌హిస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: