హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలో రెడ్మీ నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ భారీ శబ్దంతో పేలిపోయి వినియోగదారుడిని భయభ్రాంతులకు గురిచేసింది. వివరాలు తెలుసుకుంటే... వికేష్ కుమార్ అనే వ్యక్తి రెడ్మీ నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ని 2019 డిసెంబర్ నెలలో కొనుగోలు చేశాడు. ఐతే అతను మొబైల్ ఫోన్ కొన్నప్పటినుండి రెడ్మి కంపెనీ వారు ఇచ్చిన చార్జర్ నే వినియోగిస్తాడు. గురువారం రోజు తన స్మార్ట్ ఫోన్ కి 90 శాతం చార్జింగ్ పెట్టి తమ ఆఫీస్ కి రోజువారి లాగానే వెళ్ళాడు. ఆఫీస్ లోకి వెళ్లి కూర్చొని తన పని చేసుకుంటుండగా ఒక్కసారిగా తన ప్యాంటు జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ బాగా హీట్ ఎక్కింది. వెంటనే మొబైల్ ఫోన్ ని బయటకు తీయగా... అప్పటికే ఫోన్ బ్యాక్ సైడ్ నుండి పొగలు వస్తున్నాయి. దాంతో షాకైన వికేష్ ఫోన్ ని కాస్త దూరంలో వేసిరేయగా అది కొన్ని సెకండ్లలోనే భారీ శబ్ధంతో పేలిపోయింది. విసిరేసిన ఫోన్ దగ్గరిలో ఉన్న తన బ్యాగ్ మీద పడగా అది కూడా చాలా వరకు కాలిపోయింది. ఫోన్ మంటలను ఆర్పిందెకు ఒక ఫైర్ ఎక్సటింగిశేర్/ మంటలు ఆర్పే పరికరం వాడాల్సి వచ్చిందంటే ఆ స్మార్ట్ ఫోన్ ఎంత పెద్ద విధ్వంసాన్ని సృష్టించిందో ఊహించుకోవచ్చు.





' నేను 5 సెకండ్స్ లేట్ చేసినట్లయితే నాకు తీవ్రంగా గాయాలయ్యేయి. దేవుడి దయవల్ల తృటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాను' అని తన ఫేసుబుక్ పోస్టులో పేర్కొన్నాడు వికేష్. కేవలం నాలుగు నెలల క్రితం కొన్న తన ఫోన్ పేలిపోవడంతో బాధపడిన వికేష్... కాలిపోయిన ఫోన్ పరికరాలను, బ్యాగ్ ను పట్టుకొని రెడ్ మీ సర్వీస్ సెంటర్ కి వెళ్లి జరిగిన విషయాన్ని తెలియపరిచాడు. ఐతే సర్వీస్ సెంటర్ సిబ్బంది 'మీరే ఫోన్ ని ఏదో చేసి ఉంటారు. అందుకే పేలిపోయింది' అంటూ వికేష్ ని తప్పుబట్టారు. అలాగే నిజంగా ఫోన్ పేలిపోయిందా అని అనుమానిస్తూ తన బ్యాగ్ కి పడిన బొక్కని, ఫోన్ సైజు ని కొలిచారు.





దాంతో కోప్పడిన సదరు వినియోగదారుడు తానేం తప్పు చేయలేదని గట్టిగా మాట్లాడేసరికి... సర్వీస్ సిబ్బంది రెడ్మీ నోట్ 7 ప్రో సగం ధరని తాము భరించి కొత్త నోట్ 7 ప్రో ని ఇస్తామని హామీ ఇచ్చింది. ఫోన్ పేలిపోవడానికి గల కారణం పవర్ ఆన్ ఫాల్ట్ అనగా షార్ట్ సర్క్యూట్ అని తమ ఫిర్యాదు బుక్ లో రాసుకున్నారు. ఏది ఏమైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు వాళ్ల ఫోన్లు పేలిపోతే ప్రతిసారీ తన తప్పు కాదని దబాయిస్తుంటారు. మనమే చీప్ క్వాలిటీ చార్జర్లను యూజ్ చేశామని, వేరే చోట్ల రిపేరు చేయించి ఉంటామని అనేక కారణాలు చెబుతూ తప్పు మనమీదకే తోసేస్తుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: