ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా ఇప్పుడు భారతదేశంలో విస్తరిస్తుంది.. ఇప్పటికే భారతదేశంలో కరుణ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. చైనాలోని సిచువాన్లో పుట్టిన ఈ కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన విషయం తెలిసింది ప్రపంచంలో దాదాపు 5వేలకు పైగా ఈ కరుణతో మృతి చెందారు వేలమంది బారిన పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్ప్తంగా ఎక్కడ చూసినా కరుణ టాపిక్ నడుస్తుంది. కరుణకి ఇప్పటివరకు ఏ మెడిసిన్ కనిపెట్టలేదు... దాంతో ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ అంటే భయభ్రాంతులకు గురవుతున్నారు.

 

ముఖ్యంగా చైనా లో విస్తరించిన ఈ  కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రబలి పోతుంది ఎక్కడ చూసినా ఈ కరుణ గురించిన చర్చల జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కరొన పేరు చెప్తేనే కిలోమీటర్ దూరం పెడుతున్నారు జనాలు తుమ్మినా దగ్గినా అటువైపు వెళ్లడం లేదు పైగా ఇంత వింతగా చూస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఈ వైరస్ ప్రభావం వల్ల మాల్స్ పాఠశాలలు థియేటర్స్ క్లబ్లు బార్లు అన్ని మూసేస్తున్నారు. మన తెలంగాణలో క్యాబినెట్ మీటింగ్ లో ఈ విషయాలపై చర్చించారు సీఎం కేసీఆర్.

 

మొత్తానికి ఈ రేపటి నుంచి తెలంగాణలో పాఠశాల బందు దాంతో పిల్లలు అప్పుడే హాలిడేస్ వచ్చాయని సంబరపడుతున్నారు. ఓవైపు కరొనా భయంతో జనాలు వణికిపోతుంటే పిల్లలు మాత్రం తమకు హాలిడేస్ సమ్మర్ కంటే ముందే వచ్చాయని ఖుషి అవుతున్నారు. ఈ వైరస్ వల్ల పిల్లలకు ఎంతో ప్రమాదం ఉందన్న విషయం తెలిసింది అందుకని ఇప్పుడు పిల్లల్ని హాలిడేస్ ఇవ్వడంతో ఇంట్లో నుంచి బయటికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. మొత్తానికి తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం వల్ల పిల్లలకు సెలవు ఇవ్వడంపై తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉన్నా చదువు విషయంలో మాత్రం బాధ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: