ప్ర‌పంచ‌దేశాల‌న్నీ ఒకేసారి హ‌డ‌లెత్తిపోతున్న క‌రోనా వైర‌స్‌ని చైనా దేశం అరిక‌ట్టే విష‌యంలో విఫ‌ల‌మైంద‌ని ఆ దేశ‌పు అధ్య‌క్షుడి పై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు  చైనా మాజీ ప్రాపర్టీ టైకూన్ రెన్ జికియాంగ్‌.  ఇక ఆయ‌న ఒక పెద్ద జోక‌ర్ అంటూ విమ‌ర్శించారు. ఇక ఈ విష‌యం ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం ఆయ‌న ఈ నెల 12 నుంచి క‌న‌ప‌డ‌టం లేదు. ఈ విష‌యాన్ని ఆయ‌న మిత్ర‌లు మీడియాకు తెలిపారు. గతంలో చైనా అధికార కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా ఉన్న రెన్ జికియాంగ్... ప్రభుత్వ సారధ్యంలోని ప్రాపర్టీ డెవలపర్ సంస్థ హువాయియాన్ రియల్ ఎస్టేట్ గ్రూప్‌లో ఆయ‌న టాప్ ఎగ్జిక్యూటివ్‌గా ప‌ని చేశారు. 

 

అయితే ‘‘మా మిత్రుల్లో చాలామంది ఆయన కోసం వెతికిన‌ప్ప‌టికీ  ఆయ‌న ఆచూకి తెలియ‌డం లేదు. ఆయన కనిపించకపోవడంతో అంద‌రూ తీవ్ర ఆందోళనలో ఉన్నాం అని అన్నారు. అంతేకాక‌ రెన్ జికియాంగ్ అందరికీ సుపరిచితమే. ఆయన కనిపించకపోవడం పై ప్రభుత్వ సంస్థలు సాధ్యమైనంత త్వరగా ఈ విష‌యం పై స్పందించాల‌ని కోరుకుంటున్నారు అని ఆయనకు అత్యంత సన్నిహితురాలు, వ్యాపారవేత్త వాంగ్ ఇంగ్ డిమాండ్ చేశారు. అయితే అటు చైనా పోలీసులుగానీ, ఇటు సమాచార కార్యాలయ మండలి గానీ ఇంత వరకు ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌క పోవ‌డం గ‌మ‌నార్హం అంటున్నారు.

 

అయితే ఈ ఘ‌ట‌న చోటు చేసుకునే ముందు గత నెల 23న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఆయ‌న విమర్శిస్తూ రెన్ ఓ వ్యాసం రాశారు. జాతీయ మీడియా ద్వారా ఇది దేశవ్యాప్తంగా 170000 మంది పార్టీ ప్రముఖులకు దృష్టికి వెళ్లింది. అయితే సదరు వ్యాసంలో అధ్యక్షుడి పేరు ప్రస్తావించక పోయినప్పటికీ... ఆయ‌న ఎవ‌రిని ఉద్దేశించి అన్నారు అన్న విష‌య‌మైతే బాగా అర్ధ‌మ‌వుతుంది. కానీ ఒక హాస్యగాడు నగ్నంగా నిలబడి చక్రవర్తిలాగా కొనసాగుతున్నాడు...’’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక ప్ర‌తి రాజ‌కీయ పార్టీలో అంతర్గతంగా నెలకొన్న కొన్ని ‘‘పరిపాలనా సంక్షోభం’’, అలాగే పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది లోపించడం తదితర కారణాల వల్ల ఈ పరిస్థితి మరింత  దీన స్థితిగా తయారైందని ఆయన ఆరోపించారు. ఓ ప‌క్క కరోనాతో ఇబ్బందులు ఈ టెన్ష‌న్‌లో ఉంటే మ‌రో ప‌క్క రెన్ క‌న‌పించ‌కుండా పోవ‌డం అనేది అక్క‌డ ప్ర‌భుత్వానికి మ‌రో స‌వాల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: