కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు విస్తరించింది. దీంతో భారత్ లో కోవిడ్ రెండో దశ కొనసాగుతోంది. కాగా., తెలంగాణలో  తొలి కరోనా మరణం సంభవించడంతో తెలుసుకున్న సర్కార్ అప్రమత్తం అయ్యింది. మన దేశంలో ఇప్పటి వరకు 107 కేసులకు పైగా నమోదైనట్లు ఆదివారం కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రకటించింది. తెలంగాణలో ఒక కరోనా బాధిత వ్యక్తి చనిపోయాడు. ఇంకా మరో కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు అయింది. దీంతో.. కరోనా వైరస్ ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో అధికారులు వివిధ పార్కులన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

 

 

హెచ్‌ఎండీఏ హైదరాబాద్‌ తో పాటు నగరం చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో ఉన్న పార్కులు మూసివేయాలని భావించింది. కాగా., ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నగరంలోని ప్రముఖ పార్కులు అయిన లంబినీపార్క్‌, ఎన్టీఆర్‌ గార్డెన్స్, ఎన్డీఆర్‌ మెమోరియల్‌, సంజీవయ్య పార్క్‌లను ఈ నెల 21వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు hmda అధికారులు తెలిపారు. అలాగే జలగం వెంగళరావు పార్కు, పబ్లిక్ గార్డెన్, జలవిహార్‌, నెహ్రూ జువలాజికల్ జూపార్క్‌, ఇందిరా పార్క్‌,లో అన్ని మున్సిపాలిటీల్లోని పార్కులను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలోని సభలు, సమావేశాలకు అనుమతులు రద్దు చేశామని ప్రకటించారు. 

 

 

ఇదిల ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఈ నెల 31 వరకు స్కూల్స్, విద్యాసంస్థల్ని బంద్ చేసి, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. కానీ.. పరీక్షలను మాత్రం యధావిధిగా నిర్వహించాలని పేర్కొంది. అంతేకాకుండా సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ కూడా ముసివేస్తున్నమన్నారు. ఇటుపోటే.. తెలంగాణతో పాటు, గోవా, ముంబై, కర్నాటక, బీహార్, ఢిల్లీలో కూడా సినిమా థియేటర్లు, స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: