ప్రస్తుతం ఏదైనా ట్రెండ్ అవ్వాలంటే అది ఖచ్చితంగా ఫేక్ వార్త అయి ఉండాలి. ఎందుకంటే ఆ ఫేక్ వార్తలు జనాలకు బాగా నచ్చుతాయి.. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరు చదవరు.. అదే ఉన్నది లేనిది అన్ని కలిపి చెప్తే జనాలు విచ్చలవిడిగా షేర్లు చేస్తారు.. చూశారా ఈ వార్తను అంటూ షేర్ చేసేస్తారు.. ఇంకా ఈ నేపథ్యంలోనే కొన్ని ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేసాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.  

 
నెల్లూరు కరోనా.. 

 

క‌రోనా వైరస్.. ఈ వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఈ కరోనా వైరస్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో భయపెట్టింది. అది ఏంటి అంటే? నెల్లూరు న‌గ‌రంలో ఓ వ్య‌క్తికి క‌రోనా సోక‌డంతో ఆ చుట్టు ప‌క్క‌ల వాళ్లంద‌రు ఇళ్ల‌కు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు అంటూ ఫేక్ వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేసింది. దీంతో ఈ ఫేక్ వార్త‌ల‌పై క‌ర్నూలు జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందిన‌ట్టు అన‌వ‌స‌రంగా వార్త‌లు ప్ర‌చారం చేస్తూ... ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి  హెచ్చరించారు. 

 

 

హ్యారీ పోటర్ హీరోకి కరోనా.. 

 

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ''హ్యారీపోటర్‌ యాక్టర్ డేనియల్‌ ర్యాడ్‌క్లిఫ్‌కు కూడా వైరస్ సోకినట్లు.. అది బీబీసీ బ్రేకింగ్ న్యూస్ అనే ఫేక్ అకౌంట్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం'' వంటి వార్తలు రావడం అందరిని షాక్ కి గురి చేసింది. కానీ ఆ పోస్ట్ లో ఎంత మాత్రం నిజం లేదు.. కానీ ఆ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తీరా చూస్తే ఆ పోస్ట్ ఫేక్ అని తేలింది. ఈ ఫేక్ పోస్ట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: