స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులపై దాడుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న టైంలో ఏ విధంగా వ్యవహరించటం జరిగిందో మంచో చెడో సేమ్ అదే పరిస్థితులు అచ్చుగుద్దినట్టు ప్రస్తుతం జగన్ సృష్టిస్తున్నట్లు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. దీంతో స్థానిక ఎన్నికలలో ఎలాగైనా రాణించాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికలతో జగన్ క్లీన్ స్వీప్ చేసి తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు.

 

అయితే మరోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ పార్టీ లోకి వెళ్ళి పోతూ ఉండడంతో కాళ్ళూ చేతులూ ఆడడంలేదు. ఎక్కడ చూసినా కూడా నేతలు పోటీకి తయారుగా లేరు. ఎందుకొచ్చిన తంటా అన్నట్లుగా సీన్ ఉంది. ఇటువంటి తరుణంలో అధికారంలో ఉన్న వైసిపి నాయకులు కొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులకు పాల్పడటంతో...వాటికి సంబంధించిన వీడియోలను ఆధారం చేసుకుని చంద్రబాబు ప్రస్తుతం సానుభూతి రాజకీయాలకు తెరలేపారు. ఇదే తరుణంలో వైసీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలు వీడియోలను టిడిపి కి అనుకూలంగా ఉండే బాబు మీడియా పార్టీ ని హైలెట్ చేస్తూ ప్రజలను నమ్మే స్థితి కి తీసుకెళ్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో జగన్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 

అతి దారుణంగా మాచర్లలో మరియు కొన్ని చోట్ల దాడులకు పాల్పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి. మరోపక్క నామినేషన్లకు వేయడానికి వెళ్దామని బయలుదేరుతున్న ఇతర పార్టీల నాయకులపై ఒత్తిడి తీసుకువస్తూ వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నట్లు వార్తలు బలంగా వినబడుతున్నాయి. దీంతో ఇప్పుడు వైసిపి పార్టీ అంటేనే ఏపీలో ప్రజలకు భయాందోళన కలిగిస్తున్న పార్టీగా ముద్ర పడిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: