చంద్రబాబునాయుడు మరీ ఇంత నీచానికి దిగజారిపోతాడని ఎవరూ అనుకోలేదు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి ఎదురైన విషయం అందరికీ తెలిసిందే. తాను ఓడిపోవటం ఒక ఎత్తైతే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్ల మెజారిటి రావటం మరో ఎత్తు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా జగన్ సిఎం అవ్వటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. దానికితోడు సంక్షేమ పథకాల అమల్లో జగన్ దూసుకుపోతున్నాడు. ఈ విషయాన్ని చంద్రబాబు, టిడిపి నేతలు, పచ్చమీడియా అస్సలు తట్టుకోలేకపోతున్నారు.

 

ప్రత్యక్షంగా జగన్ ను ఎదుర్కోలేమన్న ఉద్దేశ్యంతోనే అలవాటైన కుట్రలకు తెరలేపినట్లున్నాడు చంద్రబాబు.  స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తన కుట్రలను అమల్లోకి పెట్టినట్లున్నాడు.  ప్రభుత్వంతో చర్చించకుండానే  కరోనా వైరస్ ను సాకుగా చూపించి ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేయటమే దీనికి ఉదాహరణగా నిలిచింది.  స్ధానిక సంస్ధల ఎన్నికల్లో  గొడవలు జరగటం అన్నది మామూలే. అలాగే ఇపుడు కూడా అక్కడకక్కడ గొడవలు జరిగాయి.

 

సరే జరిగిన గొడవలను బూతద్దంలో చూపటం ఒక ఎత్తైతే ఎన్నికల కమీషనర్ ను మ్యానేజ్ చేయటం మరో ఎత్తు. అంటే చంద్రబాబు ఒకేసారి రెండు రకాల కుట్రలకు తెరలేపాడు. గొడవలు జరుగుతున్నాయంటూ ఎంత యాగీ చేసినా ఉపయోగం కనబడకపోవటంతో  ఎన్నికల కమీషనర్ ను మ్యానేజ్ చేసి ఏకంగా ఎన్నికలనే వాయిదా వేయించాడు. నిజానికి ప్రభుత్వంతో చర్చించకుండా ఎన్నికల కమీషనర్ ఎన్నికలను వాయిదా వేసేందుకు లేదు. కానీ కేవలం చంద్రబాబును సంతోషపెట్టటానికే రమేష్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లున్నాడు. అందుకే ప్రభుత్వంతో మాట్లాడకుండానే ఏకపక్షంగా ఎన్నికలను  వాయిదా వేసేశాడు.

 

రమేష్ కుమార్ చేసిన నిర్వాకంతో  జగన్ ను గబ్బు పట్టించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడనే విషయం బయటపడింది. ఈ విషయాన్ని జగనే స్వయంగా చెప్పటం గమనార్హం. రమేష్ కుమార్ లాంటి చంద్రబాబు నమ్మకస్తులు ప్రభుత్వంలో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకుని జగన్ ఇప్పటికైనా మేల్కొవాలి. లేకపోతే కరోనా వైరస్ ను బూచిగా చూపించి ఎన్నికలను వాయిదే వేయటమే విచిత్రంగా ఉంది. ఏదేమైనా చంద్రబాబు చేస్తున్న కుట్రలను జగన్ బాగానే ఎండగట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: