రాజకీయాల్లో  ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎంతో కీలకంగా మారుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంత సంక్షోభం ఏర్పడినా బాధ్యత జవాబుదారితనం ఉంటే ఎలాంటి ఇబ్బందులను అయినా ఫేస్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ మాటలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి బాగా సరిపోతాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో తీవ్రస్థాయిలో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరసనకారులు ఏకంగా ప్రభుత్వ ఆస్తులను భారీ మొత్తంలో ధ్వంసం చేశారు. ఇక దీన్ని తీవ్రంగా పరిగణించిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏకంగా అల్లర్లు జరిగిన వారి ఆస్తులను కూడా సీజ్ చేసి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

 

 అయితే అల్లరి చేస్తున్న వారిపై ఎప్పటికప్పుడు కేసులు పెడుతూ అదుపులోకి తీసుకోవటం  వల్ల అగ్ర,  ముజఫరాబాద్ లాంటి చోట్ల ఎలాంటి అల్లర్లు జరగకుండా ఆగిపోయాయి. ఇక యూనివర్సిటీలు వివిధ ప్రాంతాల్లో కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లను చేసిన వారిని వెంటనే పట్టుకొచ్చి అక్కడి ప్రభుత్వాలు కేసులు నమోదు చేయడం లాంటివి జరగడం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ఆగిపోయాయి. అయితే ప్రభుత్వాలు బాధ్యతగా ఉండి జవాబుదారీగా ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ సందర్భంగా మరోసారి ఇలాంటి అరాచకాలకు పాల్పడకుండా ఉండేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

 

 ఇందులో భాగంగానే ఎవరైతే ఈ అల్లర్లలో పట్టుబడి కేసులు నమోదైన వారు ఉంటారో  వారి ఫోటోలను వారి దగ్గర నుంచి సీజ్ చేసిన ఆస్తుల వివరాలను కూడా  హోర్డింగ్  పెట్టాలని నిర్ణయం తీసుకుంది. కానీ దీనిని మాత్రం హైకోర్టు ఇలాంటివి ఏవి చేయొద్దని వెంటనే హోర్డింగులు తీసేయాలి అంటూ తీర్పునిచ్చింది. ఇక హైకోర్టు తీర్పుపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది... ఇక యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వాదన విన్న సుప్రీంకోర్టు... ఏ చట్ట ప్రకారం ఇదంతా జరిపారు అంటూ సుప్రీం యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన... గతంలో జరిగిన చర్యలకు ఈ చట్టం చెల్లదు.అయితే కోర్టుల తీర్పుపై మాత్రం రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: