ఇంకొన్ని రోజుల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వస్తున్న మొదటి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తిని సంతరించుకున్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అధికార పార్టీ మాత్రం టిడిపిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. ముఖ్యంగా మద్యం డబ్బు పంచ కూడదు అనే నిబంధన తీసుకొచ్చి అది కేవలం ప్రతిపక్ష పార్టీకి మాత్రమే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అంతే కాకుండా ప్రతిపక్ష పార్టీ నేతలు ఎలాంటి నామినేషన్లు వేయకుండా దౌర్జన్యాలకు కూడా పాల్పడుతుంది అధికార పార్టీ. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా ఆంధ్ర రాజకీయాలు వేడెక్కాయి. 

 

 అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకొన్ని రోజుల్లో జరగబోతున్న తరుణంలో ఏ కోర్టు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వీలుండదు. ఎందుకంటే ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత కోర్టు అడ్డుకునేందుకు ఎలాంటి అధికారం ఉండదు. కానీ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కోర్టు  జోక్యం చేసుకునే అవకాశం లేకపోలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంది అంటే.. రాయలసీమలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉంది. కేవలం అధికార పార్టీ మాత్రమే సీమలో ఘన విజయం సాధించేలా కనిపిస్తోంది. ఎందుకంటే సీమలో ప్రతిపక్షం కాడి  వదిలేసింది  అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 

 ఎందుకంటే ప్రస్తుతం టిడిపి నేతలు అందరూ తమ పై ఇక్కడ అక్రమ కేసులు మోపుతారో  అని భయపడి పోతున్నారు. ముఖ్యంగా జెసి దివాకర్ రెడ్డి లాంటి వారు గనులు తదితర అంశాలలో వైసీపీ పార్టీకి భయపడ్డారు అనే చెప్పాలి. ఇక అధికార పార్టీ స్థానిక ఎన్నికల్లో మద్యం డబ్బు పంచడం నిషేధం అని కొత్త నిబంధన తీసుకురావడంతో... ఒకవేళ పంచకుండా  గెలిచిన ఎదో విదంగా  అనర్హత వేటు పడుతుంది అని భావించి ఎన్నికల్లో పోటీచేయడంలేదు. ఇంకొకటి అసెంబ్లీ ఎన్నికల్లోనే కోట్లు ఖర్చు పెట్టామని ఇప్పుడు కూడా మరోసారి కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయి నష్టపోతాం  అన్న భయం కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో  టిడిపి పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే రాయలసీమ లో జనసేన బిజెపి పార్టీలో పోటీ లో ఉన్నప్పటికీ అది నామ  మాత్రపు  పోటీ మాత్రమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భారీ విజయాలు మాత్రం అధికార పార్టీకి దక్కడం ఖాయం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: