తిరుమలలో సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటోంది టీటీడీ. స్వామి వారి క్షణకాలం దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమవుతుందనుకునే భక్తులకు ఏకంగా గంటకు పైగా స్వామివారిని తదేకంగా దర్శించుకునే భాగ్యాన్ని కల్పిస్తోంది. ప్రతి గురువారం అభిషేక సేవకు నిర్వహించే లక్కీడిప్‌ విధానంలో అదనపు కోటాలో భక్తులకు టికెట్లు కేటాయిస్తోంది.

 

శ్రీవారి ఆలయంలో శుక్రవారం రోజున మూలమూర్తికి సుగంధ ద్రవ్య పరిమళంతో  అభిషేకం నిర్వహిస్తారు. ఈ సేవకు ప్రతి నిత్యం 160 మంది భక్తులను అనుమతించే అవకాశం ఉంది. ఇందులో అడ్వాన్స్ రిజర్వేషన్ విధానంలో సామాన్య భక్తులకు అందుబాటులో 100 టికెట్లును కేటాయించిన టీటీడీ, మరో 30 టికెట్లును ఉదయాస్తమాన సేవ టికెట్లు ఉన్న భక్తులును అనుమతించాలి. మరో 30 టికెట్లను మాత్రం టిటిడి సిఫార్సు లేఖలు పై భక్తులుకు కేటాయిస్తుంది.

 

సామాన్య భక్తులు సౌలభ్యం కోసం టీటీడీ ప్రవేశ పెట్టిన అడ్వాన్స్ రిజర్వేషన్ విధానం ద్వారా కొంత మంది భక్తులు గుంప గుత్తగా సేవా టిక్కెట్లును పొందినట్లు టీటీడీ గుర్తించింది. దీంతో 2008లో అనేక మార్పులను తీసుకువచ్చింది. బల్క్ బుకింగ్ విధానంలో టికెట్లును అడ్వాన్స్ విధానంలో బుక్ చేసుకున్న సేవా టికెట్లును రద్దు చేసి వాటిని  తిరిగి సామాన్య భక్తులుకు అందుభాటులోకి తీసుకువచ్చింది.

 

టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి భాద్యతలును చేపట్టిన అనంతరం సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేలా మార్పులు తీసుకువచ్చే చర్యలు ప్రారంభించారు.  అప్పటి వరకు వున్న ఎల్ 1,ఎల్ 2,ఎల్ 3 విధానాన్ని రద్దు చేశారు. ఇక లక్కీ డిప్ విధానంలో కూడా భక్తులుకు ఎక్కువ సంఖ్యలో టికెట్లును కేటాయించాలని అధికారులను ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. గత ఏడాది జూన్ నుంచి పరిశీలిస్తే తోమాల,అర్చన,వస్త్రం, అభిషేకం సేవా టిక్కెట్లును పెద్ద సంఖ్యలో సామాన్య భక్తులుకు అందుబాటులో ఉంచారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: