గెలుపు అవకాశాలు లేవని తెలిసి కూడా పార్టీలో సీనియర్ నేత వర్ల రామయ్యతో రాజ్యసభకు చంద్రబాబునాయుడు ఎందుకు నామినేషన్ వేయించాడు ? ఇపుడిదే ప్రశ్న చాలామందిని పట్టి పీడిస్తోంది. నిజానికి గెలవటానికి కావాల్సింది 36 ఓట్లు. కానీ టిడిపి తరపున గెలిచిందే 23 మంది ఎంఎల్ఏలు. సరే ప్రస్తుతం ఇందులో కూడా ముగ్గురు ఎంఎల్ఏలు జారిపోయారునుకోండి అది వేరే సంగతి. అంటే ఇపుడున్నది 20 మంది ఎంఎల్ఏలు మాత్రమే. అంటే 20 ఓట్లన్నమాట. మరి ఇందులో కూడా వర్లకు కచ్చితంగా అన్నీ పడతాయా ? అన్నదే చంద్రబాబును పట్టిపీడిస్తున్న అనుమానం.  ఒకవేళ పడకపోతే ?

 

ఇక్కడే చంద్రబాబు తన అతి తెలివిని చూపించాడు. పడతాయని అనుకుంటున్న ఓట్లు పడకపోయినా పోయేది వర్ల పరువే. అదే వర్ల స్ధానంలో పుత్రరత్నం లోకేష్ పోటి చేస్తే ఒకేసారి ఇద్దరి పరువూ పోతుంది. మొన్ననే మందలగిరి సారి మంగళగిరిలో పోటి చేసి గొప్పలు చెప్పుకోవటంలో ఉత్తరకుమారుడిని మించిపోయాడని నిరూపించుకున్నాడు. వైసిపి దెబ్బకు ఓడిపోవటంతో అప్పట్లో తండ్రి, కొడుకులిద్దరికీ కొద్దిరోజులు మైండ్ బ్లాంక్ అయిపోయింది లేండి. ఓటమిపై ఏమి చెప్పాలో కూడా తెలీకుండా కొద్ది రోజులు మీడియాకు కూడా మొహం చాటేశారిద్దరూ.

 

అలాంటిది  ఓటమిఖాయమని తెలిసిన రాజ్యసభ ఎన్నికల్లో లోకేష్ ను రంగంలోకి దింపితే ఇంకేమన్నా ఉందా ? పైగా పార్టీ ఓట్లు కూడా అన్నీపడకపోతే ఇద్దరి పరిస్ధితి ఎలాగుంటుందో ఎవరికి వారే అంచనా వేసుకోవాలి. ఇటువంటి అవమానం పుత్రరత్నానికి కాకుండా ఎస్సీ నేతయిన వర్లకు ఎదురైనా పర్వాలేదని చంద్రబాబు అనుకున్నాడు. ఎందుకంటే ఎస్సీలను అవమానించటం, వాళ్ళు పడటం చంద్రబాబు-ఎస్సీలకు కొత్తేమీకాదు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేపటి ఎన్నికల్లో వర్లకు డిపాజిట్ కూడా రాదని చంద్రిబాబుకు బాగా తెలుసు. ఎలాగంటే మొత్తం ఓట్లలో 6వ వంతు ఓట్లు వస్తేనే అభ్యర్ధికి డిపాజిట్ వచ్చినట్లు లెక్క.  మొత్తం 175 ఓట్లలో 6 వంతు అంటే 29 ఓట్లు రావాలి. అంటే టిడిపికి ఉన్నదే 20 ఓట్లు. ఇందులో కూడా ఎన్నిపడతాయో అనుమానమే. పైగా విప్ జారీ చేసే అవకాశం లేదు. అందుకని ఓట్లు వేయనివాళ్ళపై అనర్హత వేటు పడే అవకాశం కూడా లేదు. ఇవన్నీ ఆలోచించే సుపుత్రుడిని కాకుండా చంద్రబాబు వర్లను దించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: