చంద్రబాబుకు మిత్రుల కొదవ ఏముంది. ఎవరూ శాశ్వతం కానపుడు ఉన్నవారందరూ ఆయనకు మిత్రులే. అయితే వారంతా సందర్భానుసారం బాబు కోరిక మేరకు వస్తూంటారు, పోతూంటారు. బాబు రాజకీయ జీవితంలో ఎందరితోనో  బంధం వేసుకున్నాడు, విడిపోయాడు.

 

ఇపుడు బాబుకు ఎన్నికల్లో పొత్తులకు మిత్రులు లేరనుకుంటే ఆయనకు సరిగ్గా సరైన సమయంలో మిత్రుడొకరు కొత్తగా దొరికారట. ఆ మిత్రుడి పేరే కరోన వైరస్. ప్రపంచాన్ని గడగడవణికించేసే కరొనా వైరస్ బాబుకు మిత్రుడు గా ఉండడం విశేషమే. అదే బాబు గొప్పతనం అనుకోవాలేమో.

 

 

లేకపోతే కరోనా బూచిని చూపించి పెద్ద ఎత్తున ఏపీలో జరుగుతున్న స్థానిక  ఎన్నికలను వాయిదా వేయించిన బాబు రాజనీతిని ఆ విధంగా తన  చాటుకున్నారు. కరోనా వైరస్ భయంకరమైనదే కానీ ఇలా ఏకమొత్తంగా పదవులనే కాటేస్తుందని అనుకోలేదని నేతలు ఇపుడు దిగాలు పడుతున్నారు.

 

ఇదిలా ఉందగా కరోనా వైరస్ తో ఎన్నికలు వాయిదా వేయించిన బాబు ఆ యాంటి సెంటి మెంట్ ని మరింతగా వాడేసుకోవాలనుకుంటున్నారు. ఏపీలోనే కాదు, దేశంలో కూడా ఇద్దరు తప్ప ఇంతవరకూ ఎవరూ కరోనా వల్ల చనిపోలేదు. కానీ బాబు మాత్రం తనదైన అబద్దాలతో వార్తలు వండి వార్చేస్తున్నారు.

 

కరోనా వైరస్ తో జనాలు ఓ వైపు చచ్చిపోతూంటే జగన్ కి రాజకీయాలే ముఖ్యమా అంటూ గట్టిగా నిగ్గదీస్తున్నారు. ఆ విధంగా కరోనా భయాన్ని ఓ వైపు జనాల్లోకి పంపుతూ మరో వైపు జగన్ కరోనా కంటే పెద్ద వైరస్ అనేలా ప్రచారం చేస్తున్నారు.

 

జగన్ కి పదవులు, రాజకీయం తప్ప  జనాల ఆరోగ్యం పట్టదని  ఆయన అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే కొత్త మిత్రుడు కరోనాని ఎంత వీలైతే అంతలా వాడేస్తూ జగన్ని జనాల్లో చెడ్డ చేసేందుకు బాబు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ సక్సెస్ అవుతాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: