బోర్డర్ లో కాపు కాసే సైనికులు శత్రువుల నుంచి తమని తాము రక్షించుకోవడానికి.. అంతకు మించి శత్రువుల నుంచి దేశాన్ని కాపాడటానికి చాలానే కష్టాన్ని ఎదుర్కొంటారు. వాళ్ళు కష్టపడటమే వల్ల మనం గునెడల మీద చెయ్యి వేసుకొని నిద్రపోతున్నారు. అయితే బార్డర్ లో ఎంతటి శత్రువు నైనా మట్టు పెట్టె సైనికులు కుటుంబ సభ్యుల ముందు మాత్రం చిన్న పిల్లలే.. వారి చేతిలో చిన్న బొమ్మలే. అందుకే అంటారు వారు దేవుండ్లని.. 

 

 


ఇక్కడ ఉన్నంతకాలం దేశాన్న్ని ప్రజలను కాపాడుతూ వచ్చిన సైనికులు .. రిటైర్డ్ అయ్యాక ఫ్యామిలీని చూసుకుంటూ హాయిగా గడిపేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో భార్యను గెలవలేక కుటుంబ కలహాలకు బలైపోయిన విషాద ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. నిత్యం వివాదాలతో విసిగిపోయిన భర్త.. ఏకంగా శ్మశానానికే వెళ్లి రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

 

 

ఈ ఘటన కేవీ పల్లె మండలం గర్నెమిట్ట పంచాయతీ పరిధిలోని కొండారెడ్డిగారిపల్లెకి చెందిన సిద్దరాము(49) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్)లో హెడ్ కానిస్టేబుల్ స్థాయిలో పనిచేసి రిటైర్ అయ్యాడు.నాలుగు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేసిన ఆయన భార్యతో కుటుంబంతో కలిసి ఉన్నాడు. ఒక కుమారుడు ఇంటర్, మరో కుమారుడు డిగ్రీ చదువుతున్నారు. అయితే సిద్దరాముకి, ఆయన భార్య మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ముందు రోజు రాత్రి కూడా భార్యతో గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సిద్దరాము ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

 


గత రాత్రి అర్ధరాత్రి సమయంలో సమీపంలోని స్మశానానికి వెళ్లిన ఆయన తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడు. మృతదేహం పక్కనే మద్యం కలిపిన కూల్‌డ్రింక్ బాటిల్, రివాల్వర్ పడి ఉన్నాయి. భార్యతో గొడవపడి అర్ధరాత్రి శ్మశానానికి వచ్చిన జవాన్ సిద్దరాము.. మద్యం తాగిన తరువాత తన రివాల్వర్‌తో కణతపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: