ఆంధ్రప్రదేశ్లోని గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉందొ చెప్పాల్సిన ఆవాసం లేదు. దీనికోసం లక్షల మంది నిరుద్యోగులు చాలా వరకు పోటీపడ్డారు. దీనితో ప్రభుతం నిర్వహించిన పరిక్షలో అర్హత సాధించిన వారు కంటెంట్ ఉన్న వాళ్లు ఈ ఉద్యోగాలు పొంది గ్రామాల్లో సేవలు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు సచివాలయ ఉద్యోగం కంటే మెరుగైన ఉద్యోగాలు రావడంతో ఆ ఉద్యోగాలకి వెళ్లడానికి రాజీనామా చేస్తున్నారు. 

 

 

అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. జగన్ సర్కార్ సచివాలయ ఉద్యోగులకి షాక్ ఇచ్చింది. గ్రామ లేద వార్డు సచివాలయ ఉద్యోగుల పోస్టులను జగన్ సర్కారు విదులచేసింది. నిజానికి ఈ సచివాలయ ఉద్యోగాల్లో పీజీ, డిగ్రీ చేసిన వారే ఎక్కువగా ఉద్యోగాలలో చేరారు. వీరందరికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి జగన్ సర్కారు వారికి శిక్షణ ఇచ్చింది. అలాగే వారందిరికి జీతాలు కూడా ఇచ్చారు. 

 

 

ఇదంతా ఒక విదంగా ఉంటే ఇందులో కొంతమందికి తాజాగా వీటికంటే ఎక్కువ జీతం ఇచ్చే రైల్వే, బ్యాంకింగ్ ఇంకా అనేక వాట్లలో ఇతర ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వారు ఈ సచివాలయ ఉద్యోగాలను వదిలి వెళ్ళడానికి వారు ఇప్పుడు ఇక్కడ రాజీనామా చేశారు. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇప్పుడు జగన్ సర్కారు వారి రాజీనామాను ఆమోదించడం లేదు. ఇలా ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉద్యోగి జీతం ఇంతవరకు ఎంత తీసుకున్నాడో ఆ మొత్తంతో పాటు శిక్షణకు అయిన ఖర్చు కూడా తిరిగి ఇస్తేనే అక్కడ రాజీనామా ఆమోదిస్తామని ప్రభుత్వం చెబుతుంది.

 

 

 

దీనితో ప్రభుత్వ కఠిన నిబంధనలతో గ్రామ లేద వార్డు సచివాలయ ఉద్యోగులు ఆ ఉద్యోగాన్ని వదిలివెళ్లడం అంత సులువు కావట్లేదు. అలాగే వీరందరి కోసం శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం చేసిన ఖర్చు తీసుకున్న వేతనాలను పూర్తిగా ఇస్తేనే రాజీనామాను ఆమోదిస్తామని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: