కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న ఈ మహమ్మారి వైరస్... ఇప్పటి వరకు  136 దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ చిగురుటాకులా వణికిపోతారు. ఇక భారత దేశంలో కూడా ఈ ప్రాంతమైన వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో భారత ప్రజలు కూడా ప్రాణభయంతో బతుకుతున్నారు. దీంతో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఎన్నో రకాల చర్యలు చేపట్టాయి. ఇక అటు  ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా  వైరస్ ను  ప్రపంచ మహమ్మారిగా  ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అటు భారతదేశంలో కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా  వైరస్ మాత్రం విజృంభిస్తోంది. 

 

 అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ప్రాణాంతకమైన వైరస్ విస్తరించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రోజురోజుకు కరోనా  అనుమానితులు పెరిగిపోతున్న నేపథ్యంలోనే ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ కరోనా  వైరస్ కు  అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సంబంధించి పలు వివరాలను వెల్లడించారు. ఇందులో ఇప్పటి వరకు కరోనా అనుమానితులుగా పరీక్షలు జరిపిన వారు 70 మంది కాగా... కరోనా  ఉన్నట్టు తేలింది ఒకరికి మాత్రమే.. 57 మందికి కరోనా  వైరస్ లేదు అని నిర్ధారణ కాగా... మరో 12 మంది కరోనా  అనుమానితుల రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు స్క్రీనింగ్  జరిగి పర్యవేక్షణలో ఉన్న వారి సంఖ్య 777 కాగా... ఇక ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాధితుల సంఖ్య 512... ఇందులో 28 రోజుల పర్యవేక్షణ పూర్తి చేసుకున్న బాధితులు 244.. అబ్జర్వేషన్ లో ఉన్నవారు 21 మంది. 

 


 అయితే 1897 అంటువ్యాధులు చట్టం ప్రకారం జగన్ సర్కార్ కరోనా పై  సంచలన నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్లు, మెడికల్ హెల్త్ ఆఫీసర్లకు కరోనా  నివారణకు సంబంధించి పూర్తి అధికారాలు ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా విజయవాడ లో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో  కరోనా  వైరస్ నిర్ధారణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక 24 గంటల కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది . కరోనా  వైరస్ కు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు 08662410978 నెంబర్ ను  సూచించింది. ఇక కరోనా పై ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి 104  టోల్ ఫ్రీ నెంబర్  కూడా అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు రుమాలుతో అడ్డు పెట్టుకొని చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా కరోనా వైరస్ నియంత్రించవచ్చు అంటూ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: