ప్రస్తుతం భారతదేశంలో కరోనా  వైరస్ ప్రభావం  రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే.  ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా  ఏకంగా 100 మంది వరకు కరోనా  వైరస్ పోకిరి కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ గురించి అటు ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు. ఎక్కడ తమకు కరోనా సోకుతుందో అని  చిగురుటాకులా వణికిపోతున్నారు . ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మహమ్మారి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ తెలంగాణలో కరోనా  వైరస్ కేసులు నమోదు అవుతుండగా  మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రోజురోజుకు కరోనా వైరస్ అనుమానితులు పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. 

 

 

 ఇక తాజాగా కరోనా వైరస్  లక్షణాలున్న ఏడుగురు తాజాగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.ప్రస్తుతం వారికి ఐసోలేషన్  వార్డుల్లో  చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇక రాజమండ్రికి చెందిన రాజీవ్ రెడ్డి, లోవరాజు కరోనా  లక్షణాలు ఉన్నాయంటూ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా.. వారికి కూడా ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు వైద్యులు. ఇక కరోనా  లక్షణాలు ఉన్న వారందరిని రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపించారు.  ఇక వీరికి సంబంధించిన రిపోర్టులు  రావాల్సి ఉంటుంది. మొదట గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా  లక్షణాలు ఉన్నాయని అనుమానంతో పరీక్షలు చేయగా కరోనా  వైరస్ సోకి లేదు అని నిర్ధారణ కావడంతో గ్రామస్తులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

 

 

 అయితే అటు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ కరోనా వ్యాప్తి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోతున్న ట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది కరోనా  వ్యాధి అనుమానితులు ఆస్పత్రులకు చేరి ప్రత్యేక చికిత్స అందుకుంటున్నారు. కాగా  కరోనా  వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అటు  రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలను చేపట్టింది. రాష్ట్రంలో ఎక్కడ ఆందోళనకర పరిస్థితి లేదని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని పరిశుభ్రత పాటిస్తే సరిపోతుంది వైద్య ఆరోగ్య శాఖ కూడా స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 70 మంది కరోనా అనుమానితులు ఆస్పత్రిలో చేరారు. ఇక ఈ 70 మంది లో ఏకంగా 57 కేసులకు సంబంధించి పేషెంట్ల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ నెగిటివ్ గా  నిర్ధారణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరో 13 మంది కి సంబంధించిన నమూనాల పరీక్షలకు సంబంధించి రిపోర్టు రావాల్సి ఉంది.  అయితే ఇప్పటి వరకు ఒక్క కరోనా  పాజిటివ్ కేసు మాత్రమే నమోదైనట్లు వెల్లడించింది రాష్ట్ర ఆరోగ్య శాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి: